Secunderabad Violence Remand Report : సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. ఈ కేసులో 56 మంది నిందితుల పేర్లు చేర్చారు. కాగా, వారంతా కూడా ఫిజికల్, మెడికల్ ఫిట్ నెస్ సాధించి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారే.(Secunderabad Violence Remand Report)

Secunderabad Violence Remand Report : సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

Secunderabad Violence Remand Report

Secunderabad Violence Remand Report : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. ఈ కేసులో మొత్తం 56 మంది నిందితులు ఉన్నారు. మొదటి నిందితుడితో పాటు A 13 నుండి A 56 వరకు అరెస్ట్ చేశారు. A2 నుండి A 12 వరకు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మధుసూదన్(A1) పేరుని చేర్చారు.

అల్లర్లలో 18 మందిని ప్రత్యక్ష సాక్షులుగా చేర్చారు పోలీసులు. 56మంది నిందితులు ఫిజికల్, మెడికల్ ఫిట్ నెస్ సాధించి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. అగ్నిపథ్ పథకం ప్రకటించడంతో దానికి వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూప్ తయారు చేశారు. రైల్వే స్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ గ్రూప్, హకీమ్ పేట్ ఆర్మీ సోల్జర్స్ గ్రూప్, ఛలో సికింద్రాబాద్ ARO3 గ్రూప్, ఆర్మీ GD2021 మార్చ్ ర్యాలీ గ్రూప్, CEE సోల్జర్ గ్రూప్ లను అభ్యర్థులు తయారు చేశారు. ఈ గ్రూప్ ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం చెయ్యాలని ప్లాన్ చేశారు. పలు ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలు అభ్యర్థులకు సహకరించాయి.(Secunderabad Violence Remand Report)

Railway SP Anuradha : కాల్పులు జరిపింది వాళ్లే.. సికింద్రాబాద్ అల్లర్లపై రైల్వే ఎస్పీ వివరణ

తమ ప్లాన్ లో భాగంగా ఉదయం 8.30 గంటలకు కలవాలని నిర్ణయించారు. ఘటన రోజు ఉదయం స్టేషన్ లోని ప్లాట్ ఫామ్ నెం 1 గేట్ 3 నుంచి ఎంట్రీ ఇచ్చారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా అభ్యర్థులు నినాదాలు చేశారు. ఆత్మరక్షణ కోసమే పోలీసులు నిరసనకారుల పై కాల్పులు జరిపినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో బుల్లెట్ తగిలి రాకేష్ మృతి చెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి.

ఉద్యోగార్థులను ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీ వారే అభ్యర్థులను రెచ్చగొట్టినట్లు తేలింది. స్టేషన్ కు వచ్చే సమయంలోనే పెట్రోల్ వెంట తేవాలని కొంతమంది సూచనలు చేశారు. విధ్వంసం కారణంగా రైల్వేశాఖకు రూ.20 కోట్ల నష్టం వాటిలింది. కాగా, అభ్యర్థులను రెచ్చగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు పేరు రిమాండ్ రిపోర్టులో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.

Secunderabad Station Mastermind : సికింద్రాబాద్ విధ్వంసం.. సుబ్బారావుపై పోలీసుల ప్రశ్నల వర్షం

* ఈ నెల 17న 12 గంటల సమయంలో స్టేషన్ మేనేజర్ ఫిర్యాదు చేశాడు.

* ఉదయం 2వేల మంది బోయగూడ వైపు స్టేషన్ లోకి ఎంట్రీ అయ్యారు.

* లోపలకి వచ్చిన అనంతరం నినాదాలు చేయడం మొదలు పెట్టారు.

* అందులో కొంతమంది రైల్ ఇంజిన్ కోచ్ లపై రాళ్లు విసిరారు.

* ఆ టైంలో స్టేషన్ లో ధనపూర్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ తో పాటు మరికొన్ని రైళ్లు ఫ్లాట్ ఫామ్ పై ఉన్నాయి.

* ఒక్కసారిగా రాడ్లు, కర్రలు పట్టుకుని దాడులు చేశారు.

* ఫ్లాట్ ఫామ్ నెంబర్ 10 పై ఉన్న రైల్లో 4 వేల లీటర్ల HSD, 3వేల లీటర్ల ట్రాన్స్ ఫార్మర్ ఆయిల్ తో ఉన్న రెండు ఇంజిన్లు ఉన్నాయి.

* సమూహంలో కొంత మంది 2 ఇంజిన్లకు నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు.

* పోలీస్ సిబ్బంది అడ్డుకునే క్రమంలో పోలీసులపై రాళ్ల దాడి చేశారు.

* రెండు ఇంజిన్లకు నిప్పు అంటుకుని ఉంటే భారీ నష్టం జరుగుతుందని భావించిన పోలీసులు కాల్పులు జరిపారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw