Abdullapurmet Naveen Case : దోషులకు ఉరి శిక్ష వేయకపోతే పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటాం : నవీన్ తండ్రి శంకర్ నాయక్

అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసులో దోషులకు ఉరి శిక్ష వేయాలని ఆయన తండ్రి శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. ఉరి శిక్ష పడితేనే తన కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. దోషులకు ఉరి శిక్ష వేయకపోతే పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని శంకర్ నాయక్ హెచ్చరించారు.

Abdullapurmet Naveen Case : దోషులకు ఉరి శిక్ష వేయకపోతే పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటాం : నవీన్ తండ్రి శంకర్ నాయక్

NAVEEN CASE (1)

Abdullapurmet Naveen Case : అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసులో దోషులకు ఉరి శిక్ష వేయాలని ఆయన తండ్రి శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. ఉరి శిక్ష పడితేనే తన కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. దోషులకు ఉరి శిక్ష వేయకపోతే పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని శంకర్ నాయక్ హెచ్చరించారు. కష్టపడి తన కొడుకును బీటెక్ వరకు చదివించానని తెలిపారు. నవీన్ కు మొదటి నుంచి గొడవలంటే భయం అన్నారు. నవీన్ పై చాలా ఆశలు పెట్టుకున్నామని శంకర్ నాయక్ పేర్కొన్నారు. రెండు నెలలైతే బీటెక్ పూర్తవుతుందని, లైఫ్ బాగుంటుందని ఆశించామని చెప్పారు. అంతలోపే నవీన్ ను హత్య చేశాని వాపోయారు. కొడుకు మృతితో కన్నీరుమున్నీరుగా విలపించారు.

నవీన్ హత్య కేసులో నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో హసన్, నిహారికను పోలీసులు రిమాండ్ కు తరలించారు. హసన్ ను చర్లపల్లి జైలుకు తరలించగా నిహారికను చంచల్ గూడ జైలుకు తరలించారు. రాత్రి పొద్దు పోయాక నిందితులు హసన్, నిహారిక వనస్థలీపురం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. అనంతరం హయత్ నగర్ జడ్జీ నివాసానికి తరలించారు. దీంతో న్యాయమూర్తి ఇద్దరికీ కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. నవీన్ హత్య కేసులో ఏ-1గా హరిహర కృష్ణ ఉండగా, ఏ-2గా హసన్, ఏ-3గా నిహారికను చేర్చారు.

Abdullapurmet Naveen Case : నవీన్ హత్య కేసు నిందితులకు 14 రోజులు రిమాండ్.. చర్లపల్లి జైలుకు హసన్, చంచల్ గూడ జైలుకు నిహారిక తరలింపు

ఇప్పటికే గత నెల (ఫిబ్రవరి) 24న హరిహర కృష్ణ అరెస్టు కావడంతో రిమాండ్ లో ఉన్నాడు. పోలీస్ కస్టడీలో అతను చెప్పిన సమాధానం ఆధారంగా హసన్, నిహారికను పోలీసులు అరెస్టు చేశారు. నవీన్ హత్యపై ఎల్ బీ నగర్ డీసీపీ సాయిశ్రీ కీలక విషయాలు వెల్లడించారు. హత్యకు ముందు ఇద్దరికీ ప్రమేయం లేదని చెప్పారు. నవీన్ ను హత్య చేశాక హరిహర కృష్ణ హసన్ ఇంటికి వెళ్లాడని తెలిపారు. హసన్ వద్దన్నా.. అతని ఇంట్లో ఉండి హసన్ బట్టలు వేసుకుని ఉదయం వెళ్లి పోయాడని డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు.

10 రోజులపాటు పోలీసుల విచారణలో ఎలాంటి స్పష్టత ఇవ్వని నిందితుడు హరిహర కృష్ణ ఎట్టకేలకు నోరు విప్పాడు. తన ప్రియురాలు నిహారిక కోసమే హత్య చేసినట్లు పోలీసు కస్టడీలో తెలిపారు. దీంతో నిహారికతోపాటు హరిహర కృష్ణ స్నేహితుడు హసన్ ను ఈ కేసులో పోలీసులు నిందితులుగా చేర్చారు. నవీన్ హత్య కేసులో ఏ-1గా నవీన్, ఏ-2గా హసన్, ఏ-3గా నిహారిక ఉన్నారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణంగా పోలీసులు తేల్చారు. హత్యకు ముందు ఇద్దరికీ ప్రమేయం లేదని చెప్పారు.

Naveen Case : ఆమె కోసమే హత్య.. ఎట్టకేలకు నోరు విప్పిన హరి, నవీన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు

హత్య జరిగిన తర్వాత నిహారిక 1500 రూపాయలు ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేసిందని నిర్ధారించారు. నవీన్ హత్య తర్వాత ఘటనా స్థలానికి హరిహర కృష్ణ, నిహారిక కలిసి వెళ్లారు. అక్కడ ఓ రెస్టారెంట్ లో భోజనం చేశారని డీసీపీ సాయిశ్రీ తెలిపారు. హసన్ కూడా నవీన్ హత్య స్పాట్ కు వెళ్లాడని చెప్పారు. నిహారిక ఫోన్ లోని డేటాను ఆమెనే డిలీట్ చేశారని, ఎవిడెన్స్ టాంపరింగ్ కు పాల్పడ్డారని డీసీపీ సాయిశ్రీ తెలిపారు. నవీన్ హత్య జరిగిన తర్వాత నిందితుడు హరిహర కృష్ణకు అతని స్నేహితుడు హసన్ షెల్టర్ ఇచ్చాడు.

రక్తపు బట్టలు ఆ ఇంట్లోనే మార్చుకున్నాడు. ఆ తర్వాత హసన్ బట్టలు వేసుకున్నాడు. ఉదయం వెళ్లిపోయాడని డీసీపీ సాయిశ్రీ చెప్పారు. నవీన్ ను హరిహర కృష్ణ ఒక్కడే హత్య చేశాడని, మృతదేహాన్ని దహనం చేసేందుకు హసన్ సహకరించాడని పోలీసులు తేల్చారు. ఫిబ్రవరి 17న నవీన్ హత్య కాగా, ఫిబ్రవరి 24న హరిహర కృష్ణ అరెస్టు అయ్యారు. 10 రోజుల తర్వాత కస్టడీలో హరిహర కృష్ణ నోరు విప్పడంతో హసన్, నిహారికలను పోలీసులు అరెస్టు చేశారు.

Naveen Case : నవీన్ హత్యకు ప్రధాన కారణం అదే.. 3 నెలలు వెయిట్ చేసి మరీ లేపేశాడు

ఫిబ్రవరి 17న పక్కా ప్లాన్ ప్రకారం నవీన్ ను హరిహర కృష్ణ హత్య చేశాడు. నవీన్ కనిపించకపోవడంతో స్నేహితులు తన తండ్రికి సమాచారం ఇచ్చారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన సమయంలో తండ్రి సూచనతో ఫిబ్రవరి 24న హరిహర కృష్ణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆ మరుసటి రోజు అతన్ని రిమాండ్ కు తరలించారు.