Naveen Case : ఆమె కోసమే హత్య.. ఎట్టకేలకు నోరు విప్పిన హరి, నవీన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు

ఈ కేసులో పోలీసులు మరిన్ని విషయాలు బయటపెట్టారు. ఫిబ్రవరి 17న నవీన్ ను హరి హత్య చేశాడు. ఫిబ్రవరి 24న హరి అరెస్ట్ అయ్యాడు. 10 రోజుల తర్వాత పోలీస్ కస్టడీలో హరి నోరు విప్పడంతో.. నిహారిక, హసన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్ హత్య కేసు వివరాలను ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు.

Naveen Case : ఆమె కోసమే హత్య.. ఎట్టకేలకు నోరు విప్పిన హరి, నవీన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు

Naveen Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎట్టకేలకు నిందితుడు హరిహరకృష్ణ 10 రోజుల తర్వాత పోలీస్ కస్టడీలో నోరు విప్పాడు. అమ్మాయి కోసమే నవీన్ ను హత్య చేసినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు నిహారికను నిందితురాలిగా చేర్చి అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు నిందితుడు హరికి సహకరించిన అతడి స్నేహితుడు హసన్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవీన్ హత్య కేసులో ఏ-1గా హరిహరకృష్ణ, ఏ-2గా హసన్, ఏ-3గా నిహారిక ఉన్నారు.

Also Read..Abdullapurmet Naveen Case : హరిహరకృష్ణలో కనిపించని పశ్చాత్తాపం, చట్టంలో లొసుగులే బయటకు తీసుకొస్తాయని ధీమా

ఈ కేసులో పోలీసులు మరిన్ని విషయాలు బయటపెట్టారు. ఫిబ్రవరి 17న నవీన్ ను హరి హత్య చేశాడు. ఫిబ్రవరి 24న హరి అరెస్ట్ అయ్యాడు. 10 రోజుల తర్వాత పోలీస్ కస్టడీలో హరి నోరు విప్పడంతో.. నిహారిక, హసన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్ హత్య కేసు వివరాలను ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. నవీన్ హత్యకు ముందు నిహారిక, హసన్ కు ప్రేమయం లేదన్నారు. నవీన్ ను హత్య చేశాక హసన్ ఇంటికి వెళ్లాడు హరి. హసన్ వద్దన్నా అతడి ఇంట్లోనే హరిహరకృష్ణ ఉన్నాడు. హసన్ బట్టలు వేసుకున్నాడు. ఉదయం కాగానే వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు.

Also Read..Abdullapurmet Incident : నవీన్ కేసు విచారణలో షాకింగ్ విషయాలు.. హత్య ఎలా చేయాలో యూట్యూబ్ లో సెర్చ్ చేసిన హరిహర కృష్ణ

”ఫిబ్రవరి 17న నవీన్ ను హరి చంపేశాడు. హసన్ ఇంటికి వెళ్లాడు. బట్టలు మార్చుకున్నాడు. హసన్ తో కలిసి నవీన్ శరీర భాగాలను మన్నెగూడ పరిసరాల్లో పడేశాడు. 18న నిహారిక ఇంటికి వెళ్లాడు. నవీన్ హత్య విషయాన్ని చెప్పాడు. ఖర్చుల కోసం రూ.1500 తీసుకుని వెళ్లిపోయాడు. 20న నవీన్ ను చంపిన ప్రాంతాన్ని నిహారికకు చూపెట్టాడు. రెస్టారెంట్ లో భోజనం చేశారు. విషయం బయటపడటంతో 24న శరీర భాగాలను తగలబెట్టారు. అనంతరం హరి పోలీసులకు లొంగిపోయాడు” అని నవీన్ హత్య కేసులో కీలక విషయాలను డీసీపీ వెల్లడించారు.

Also Read..Abdullapurmet Incident : హత్య చేసి మర్మాంగాన్ని కోసి.. నవీన్ మర్డర్ కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు

హత్య కేసులో నిహారిక, హసన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిద్దరికి వనస్థలిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం వారిద్దరినీ హయత్ నగర్ జడ్జి నివాసానికి తరలించారు పోలీసులు.

నవీన్ కేసులో నిందితుడు హరిహరకృష్ణకు సహకరించడమే కాకుండా హత్య విషయం తెలిసినా దాచి పెట్టినందుకు పోలీసులు నిహారిక, హసన్ లను అరెస్ట్ చేశారు.

ఈ కేసులో నిహారిక అరెస్ట్ కీలక పరిణామంగా చెప్పొచ్చు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడిగా ఉన్న హరిహరకృష్ణను కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు.. ఆధారాలు సేకరించారు. నవీన్ హత్య కేసులో ప్రియురాలు నిహారిక ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. నిహారికతో పాటు హరి స్నేహితుడు హసన్ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. దీంతో ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. నవీన్ హత్య గురించి తెలిసినా.. నిహారిక కానీ హసన్ కానీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు.