TRS SYMBOL: టీఆర్ఎస్ పార్టీకి షాక్.. ‘కారు’ గుర్తును పోలిన గుర్తులపై పిటిషన్ కొట్టివేత

హైకోర్టులో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. తమ కారు గుర్తును పోలిన వేరే గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించవద్దని కోరుతూ టీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

TRS SYMBOL: టీఆర్ఎస్ పార్టీకి షాక్.. ‘కారు’ గుర్తును పోలిన గుర్తులపై పిటిషన్ కొట్టివేత

TRS SYMBOL: తెలంగాణ హైకోర్టులో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థులకు ‘కారు’ను పోలిన గుర్తులను కేటాయించకుండా ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలి అంటూ టీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

Woman Bank Manager: బ్యాంకు దోపిడీకి కత్తితో వచ్చిన దుండగుడు.. మహిళా మేనేజర్ ఎలా పోరాడిందో చూడండి.. వైరల్ వీడియో

ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున ఇప్పుడు జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కారును పోలినట్లుగా కెమెరా, చపాతీ రోలర్, డోలి (పల్లకి), రోడ్డు రోలర్, సబ్బు పెట్టె, టీవీ, కుట్టు మెషీన్, ఓడ గుర్తులను మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ కేటాయించింది. ఈ గుర్తులపై టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ గుర్తులన్నీ ఈవీఎంలలో స్టాంపు సైజులో ఒకేలా కనిపిస్తాయని, దీని వల్ల తమ ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని టీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో అభ్యర్థులకు ఈ గుర్తులు కేటాయించవద్దని కోరుతూ, ఈసీకి ఆదేశాలివ్వాలని హైకోర్టులో టీఆర్ఎస్ పార్టీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ఈ పిటిషన్ డిస్మిస్ చేసింది. కాగా, గతంలో ఇలాంటి గుర్తుల కారణంగా టీఆర్ఎస్ నష్టపోయింది. స్వతంత్ర అభ్యర్థులకు భారీ సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయి.