TSPSC Paper Leak : టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం, సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సిట్ నివేదిక

TSPSC Paper Leak: కేబినెట్ నిర్వహించి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పేపర్ లీకేజ్ డ్రామా ఆడుతున్నాయని మండిపడ్డారు.

TSPSC Paper Leak : టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం, సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సిట్ నివేదిక

TSPSC Paper Leak (Photo : Google)

TSPSC Paper Leak : తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేపర్ లీక్ కేసుని విచారించిన సిట్.. తన దర్యాఫ్తు నివేదికను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సమర్పించింది. ఈ కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని సిట్ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు వివరించింది.

250 పేజీల నివేదిక, ఎంక్లోజర్స్ ను కోర్టుకి సమర్పించింది. 18 పేజీల ఇన్విస్టిగేషన్ సమ్మరీ రిపోర్ట్ ని  కూడా సిట్ హైకోర్టులో సబ్మిట్ చేసింది. పేపర్ లీకేజీలో రూ.40లక్షల నగదు లావాదేవీలు జరిగినట్టు సిట్ తన నివేదికలో పేర్కొంది. ఈ కేసులో 17 మందిని అరెస్ట్ చేశారు. శంకర్ లక్ష్మిని సాక్షిగా పరిగణించింది సిట్.

టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీలో ప్రధాన పాత్ర ప్రవీణ్, రాజశేఖర్ లదే అని సిట్ నిర్ధారించింది. టీఎస్ పీఎస్ సీ మెంబర్, చైర్మన్ విచారించినట్లు తెలిపింది. సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదు.. సీబీఐ, సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలన్న పిటిషన్లపై తన రిపోర్టులో వివరణ ఇచ్చింది సిట్.

గతంలో ఎన్నో సెన్సేషనల్ కేసులను విచారించామని సిట్ గుర్తు చేసింది. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులోనూ పటిష్ట దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని తన రిపోర్టులో పేర్కొంది సిట్.

Also Read..Gurukula jobs : తెలంగాణాలో గురుకుల ఉద్యోగాల భర్తీకి ఈనెల 12 నుండి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

కాగా.. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో కీలకంగా మారిన FSL రిపోర్టును కూడా కోర్టుకి సమర్పించింది సిట్. దర్యాప్తులో భాగంగా వివాదాస్పద కామెంట్స్ చేసిన రాజకీయ నాయకులకి నోటీసులిచ్చామంది. కానీ, వాళ్లు ఎలాంటి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంది. సాక్షుల, నిందితులు, మెంబర్. చైర్మన్ ఇచ్చిన స్టేట్ మెంట్స్, ఆధారాలను కోర్టుకి సమర్పించింది సిట్.

మరోవైపు ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగింది. ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్, డేటా థెఫ్ట్ లో ఈడీ దర్యాప్తు చేయనుంది. పేపర్ లీకేజీ అంశంలో భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. కోట్ల రూపాయలు హవాలా రూపంలో చేతులు మారినట్లు భావిస్తోంది.

Also Read..TSPSC paper leak: అప్పటి నుంచి పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి: బీజేపీ

టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ కేసులో మొత్తం 17మందిని అరెస్ట్ చేశారు. వారిలో 15మందిని కస్టడీలోకి తీసుకుని వివరాలు రాబట్టారు. టీఎస్ పీఎస్ సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సెక్రటరీ అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డి పాటు పలువురి సేట్ మెంట్లను నమోదు చేశారు.

”Tspsc పేపర్ లీక్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. సిట్ తన నివేదికను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు అందించింది. కోర్టు తదుపరి విచారణ 24వ తేదీకి వాయిదా పడింది. నిరుద్యోగుల పక్షాన జడ్జిమెంట్ వస్తుందని భావిస్తున్నాం” అని NSUI ప్రెసిడెంట్ వెంకట్ తెలిపారు. 18న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే దీక్షలో పాల్గొనాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు వెంకట్.