TSPSC paper leak: అప్పటి నుంచి పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి: బీజేపీ

ఔట్ సోర్సింగ్ లో ఉన్న వ్యక్తులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC)లో ఎలా పెట్టుకున్నారని మర్రి శశిధర్ రెడ్డి నిలదీశారు. విద్యార్థుల, ప్రజల అనుమానాలను నివృత్తి చేయడం ప్రభుత్వ బాధ్యతని అన్నారు.

TSPSC paper leak: అప్పటి నుంచి పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి: బీజేపీ

Marri Shashidhar Reddy

TSPSC paper leak: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) లీకేజీ విషయంలో బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి (Marri Shashidhar Reddy) మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జనార్దన్ రెడ్డి 2021 నుంచి టీఎస్పీఎస్సీలో ఛైర్మన్ గా ఉన్నారని తెలిపారు. అప్పటి నుంచి పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని చెప్పారు.

పేపర్ల లీకేజీ విషయంలో ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. 30 లక్షల మందికి ఏ విధంగా నమ్మకం కల్పిస్తారని ప్రశ్నించారు. దీనిపై జ్యూడీషియల్ ఎంక్వయిరీ జరగాలని, పూర్తి ఆధారాలు బయటపెట్టాలని అన్నారు. ఔట్ సోర్సింగ్ లో ఉన్న వ్యక్తులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC)లో ఎలా పెట్టుకున్నారని ఆయన నిలదీశారు. విద్యార్థుల, ప్రజల అనుమానాలను నివృత్తి చేయడం ప్రభుత్వ బాధ్యతని అన్నారు.

ప్రతిపక్ష పార్టీగా ప్రజల పట్ల బీజేపీ పోరాటం చేస్తూనే ఉందని తెలిపారు. బీజేపీ నేత చంద్రవదన్ మాట్లాడుతూ… మొదట్లోనే పేపర్ లీకేజీ అంశం బయటపడిందని చెప్పారు. నిరుద్యోగులను, విద్యార్థులను ఓ యూనివర్సిటీలో కలిశామని, పేపర్ లీకేజీ విషయంలో విద్యార్థులు తమ బాధ చెప్పుకున్నారని తెలిపారు. టీఎస్పీఎస్సీని పూర్తిగా రద్దు చేయాలని విద్యార్థులు కోరుతున్నారని చెప్పారు. ఆ బోర్డ్ మెంబర్స్ ను అందరినీ మార్చాలని కోరుతున్నారని తెలిపారు.

బీజేపీ నేత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ… గతంలో నిర్వహించిన పరీక్షల పేపర్లు అన్నీ లీక్ చేశారని ఆరోపించారు. ప్రతి పేపర్ లీక్ వెనకాల ఐటీ హస్తం ఉందని చెప్పారు. అలాగే, జీహెచ్ఎంసీలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల విషయంలో ఫేక్ సెర్టిఫికెట్స్ ఇచ్చారని అన్నారు. ప్రభుత్వంపై, ఐటీ మంత్రి ఇచ్చిన హామీపై విద్యార్థులకు, ప్రజలకు నమ్మకం లేదని అన్నారు.

జ్యూడీషియల్ ఎంక్వయిరీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక యూపీఎస్సీలా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తుందని అన్నారు. ఈ నెల 15న నిరుద్యోగ మిలియన్ మార్చ్ లో భాగంగా అన్ని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొననున్నాయని తెలిపారు.

Gurukula jobs : తెలంగాణాలో గురుకుల ఉద్యోగాల భర్తీకి ఈనెల 12 నుండి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం