సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు జరిమానా

  • Published By: veegamteam ,Published On : December 20, 2019 / 04:01 PM IST
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు జరిమానా

సిద్దిపేటలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు రూ.45 వేల జరిమానా విధించారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో హైదరాబాద్ రహదారికి ఇరువైపులా హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. శుక్రవారం (డిసెంబర్ 20, 2019) స్థానిక కొత్త బస్టాండ్, శివమ్స్ గార్డెన్ దగ్గర సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హోర్డింగ్ కనిపించడం లేదని హరితహారంలో నాటిన 8 సంవత్సరాల 4 చెట్లను నరికివేశారు. 

దీనిని గుర్తించిన మున్సిపల్ హరితహారం అధికారులు సదరు షాపింగ్ మాల్ నిర్వాహకులకు రూ.45 వేల జరిమానా విధించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో హరితహారంలో నాటిన మొక్కలను ధ్వంసం చేసిన నరికివేసిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.