Telangana : అర్బన్ మావోయిజాన్ని విస్తరించేందుకు దళాల యత్నాలు .. తెలంగాణ-చత్తీస్‌గఢ్ పోలీసులు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ వ్యూహాలు

అర్బన్ మావోయిజాన్ని విస్తరించేందుకు దళాల యత్నాలు .. వీరి వ్యూహాలను ఇంటలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. దీంతో తెలంగాణ-చత్తీస్‌గఢ్ పోలీసులు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ షురూ చేశారు. తెలంగాణ- ఛత్తీజ్ గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ తో అడవులను జల్లెడపతున్నారు.

Telangana : అర్బన్ మావోయిజాన్ని విస్తరించేందుకు దళాల యత్నాలు .. తెలంగాణ-చత్తీస్‌గఢ్ పోలీసులు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ వ్యూహాలు

Telangana-Chhattisgarh Police Anti-Maoist Operations..Focus on Urban Maoism

Maoist Moments In Telangana : ఇన్నాళ్లూ లేనిది.. మావోయిస్ట్ పార్టీ ఇప్పుడే యాక్టివ్ అవటానికి ఓ రీజన్ ఉంది. పార్టీ ఇప్పుడు రిక్రూట్‌మెంట్ మీద ఫోకస్ పెంచింది. అంతేకాదు.. అర్బన్ మావోయిజాన్ని కూడా విస్తరించేందుకు ప్రయత్నిస్తోందని.. పోలీస్ ఇంటలిజెన్స్ వర్గాలు పసిగట్టాయ్. అంతేకాదు.. కోవర్టులుగా ఉంటూ పార్టీకి నష్టం చేసిన వారిని ప్రజా కోర్టులో శిక్షించాలని అన్ని దళాలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే.. తెలంగాణ-చత్తీస్‌గఢ్ పోలీసులు జాయింట్‌గా.. యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు.

దండకారణ్యంలోని మావోయిస్ట్ పార్టీ నేతలంతా.. ఇప్పుడు తిరిగి ఏజెన్సీ ఏరియాలు, సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంపై పట్టు సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అంతేకాదు.. చత్తీస్‌గఢ్, ఖమ్మం సరిహద్దుల్లో ఉన్న కోవర్టులను హతమారుస్తుండటంతో మావోయిస్ట్ దళాల టార్గెట్‌లో ఉన్న వాళ్లంతా భయంతో వణికిపోతున్నారు. దీంతో.. వారిని కట్టడి చేసేందుకు.. తెలంగాణ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ముగ్గురు ఐపీఎస్ అధికారుల కనుసన్నల్లో.. పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. ఇటీవలే.. తెలంగాణ, ఆంధ్రా, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన మావోయిస్ట్ దళాలు.. పోలీసుల నుంచి తప్పించుకొని.. రహస్య ప్రాంతంలో షెల్టర్ తీసుకొని ఉంటాయని భావిస్తున్నారు. వారికోసం.. ప్రత్యేక దళాలతో కూంబింగ్ కొనసాగిస్తూ.. అడవులను జల్లెడ పడుతున్నారు.

Telangana : మవోలను మట్టుపెట్టటానికి తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌

మావోయిస్టుల కదలికలతో భద్రాద్రి కొత్తగూడెం, వెంకటాపురం, వాజేడు ఏజెన్సీలో.. నిత్యం వాహన తనిఖీలు, కార్డన్ సెర్చ్‌లు జరుపుతున్నారు. అనుమానితుల వివరాలు ఆరా తీస్తున్నారు. మావోయిస్టుల దళ సభ్యుల చిత్రాలతో.. ముద్రించిన కరపత్రాలు కూడా విడుదల చేశారు. వాళ్లెక్కడైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందజేయాలని.. అలా తెలిపిన వారికి 5 నుంచి 20 లక్షల రివార్డ్ ఇస్తామని ప్రకటించారు. ఏ ప్రాంతంలో.. మావోయిస్టులు అడుగు పెట్టినా.. ఇట్టే సమాచారం తెలిసేలా.. టెక్నాలజీని కూడా వినియోగించుకోవాలని.. పోలీసులు డిసైడ్ అయ్యారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని తూర్పు అటవీ ప్రాంతంపైనా పట్టు సాధించేందుకు మావోయిస్టులు సిద్ధమవుతున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ సరిహద్దులను కలుపుతూ.. ఈ ప్రాంతం ఉండటంతో ఒకప్పుడు మావోయిస్టులకు సేఫ్ షెల్టర్ జోన్‌గా ఉండేది. మహదేవపూర్, కాటారం, కొయ్యూర్ అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో.. పార్టీ అగ్రనేతలు అమరులవడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే.. ఈ మధ్య కాలంలోనే.. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి కార్యదర్శి వెంకటేశ్ పేరిట.. ప్రజాప్రతినిధులు, కోవార్టులను హెచ్చరిస్తూ.. మావోయిస్ట్ పార్టీ లేఖలు విడుదల చేసింది. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకు.. వార్నింగ్ ఇవ్వడం.. స్థానికంగా కలకలం రేపింది.

Maoists Movements in Telangana : తెలంగాణలో మళ్లీ మావోయిస్టుల కదలికలు .. అప్రమత్తమైన పోలీసులు.. మావోల తలపై రివార్డు ప్రకటన

ఇక.. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో.. 10 మంది మావోయిస్టులు వచ్చినట్లుగా.. కొన్ని రోజుల క్రితమే పోలీసులకు సమాచారం అందింది. కూంబింగ్ చేస్తున్న పోలీసులకు.. బోథ్ అటవీ ప్రాంతంలో.. మావోయిస్ట్ డంప్ ఆచూకీ దొరికింది. ఆడెల్లు దళం.. తిరిగి పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా నిఘా వర్గాలు భావిస్తున్నాయ్. ఇప్పటికే.. ఇన్‌ఫార్మర్లను అప్రమత్తం చేసిన పోలీసులు.. అటవీ ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని.. వాల్ పోస్టర్లు ప్రచురిస్తున్నారు. ఆడెల్లు అలియాస్ భాస్కర్‌ను పట్టిస్తే.. 20 లక్షలు రివార్డ్ ఇస్తామంటూ.. పోలీస్ శాఖ ప్రకటించింది. ఇతనితో పాటు మరికొందరు దళ సభ్యులపై 5 లక్షల రివార్డులున్నాయి.

కొన్ని నెలల తర్వాత.. తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ మావోయిస్టుల కదలికలు పెరగడంతో.. పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. బోర్డర్‌లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అంతేకాదు.. మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న ప్రజాప్రతినిధులను.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరిస్తున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా.. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల వైపు వెళ్లొద్దని సూచిస్తున్నారు. అంతేకాదు.. మాజీ మావోయిస్టుల కదలికలపైనా పోలీసులు దృష్టి సారించారు. సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతోనూ నిఘా ఏర్పాటు చేశారు. ఏదేమైనా.. ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలు.. పోలీసులు, మావోయిస్టుల మధ్య నలిగిపోతున్నారు. మొత్తానికి.. మావోయిస్టుల రీఎంట్రీతో.. ఫారెస్ట్‌లో టెన్షన్ నెలకొంది.

Maoists Entered In Telangana : మావోయిస్టుల ఏరివేతకు తొలిసారి రంగంలోకి దిగిన NSG బలగాలు