Telangana Rains : రాష్ట్రంలో వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

Telangana Rains : రాష్ట్రంలో వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

Cm Kcr

Telangana Rains : గత నాలుగు రోజులుగా తెలంగాణలో  కురుస్తున్న వానలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈరోజు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులు,ప్రజా ప్రతి నిధులతో ఫోన్లో మాట్లాడుతూ రక్షణ చర్యల పై సీఎం కేసిఆర్ అదేశాలిస్తున్నారు.

అన్ని జిల్లాల అధికారులతో మాట్లాడుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అంచనా వేస్తున్నారు. గోదావరి లో వరద పరిస్థితిని, నదీ ప్రవాహాన్ని.,గోదావరి ఉప నదుల్లో వరద పరిస్థితిని సీఎం ఆరా తీస్తున్నారు. సమాచారాన్ని స్క్రీన్ మీద పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముందస్తు అంచనా వేస్తున్నారు.

అవసరమైన చోట తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితిలు ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని సిఎం కేసిఆర్ మరోమారు స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పైళ్ల శేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.నర్సింగ రావు, సీఎంఓ కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, సీఎం వోఎస్డి ప్రియాంక వర్ఘీస్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ఇఎన్పీ మురళీధర్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డిజి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.