Telangana Corona News : తెలంగాణకు రిలీఫ్.. కరోనా కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్యే ఎక్కువ

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 27వేల 995 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 19వేల 613 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 271కి తగ్గింది.

Telangana Corona News : తెలంగాణకు రిలీఫ్.. కరోనా కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్యే ఎక్కువ

COVID19 cases in India

Telangana Corona News : తెలంగాణకు రిలీఫ్. కరోనా రోజువారీ కేసుల సంఖ్య తగ్గింది. అదే సమయంలో కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో 39వేల 413 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 612 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 268 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 42 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 37 కేసులు, కరీంనగర్ జిల్లాలో 24 కేసులు వెల్లడయ్యాయి.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 1061 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

North Korea: కొవిడ్‌పై గెలిచామని ప్రకటించిన కిమ్ జంగ్ ఉన్

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 27వేల 995 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 19వేల 613 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 271కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 24 గంటల్లో 38వేల 031 శాంపిల్స్ నిర్వహించగా.. 605 మందికి పాజిటివ్ గా తేలింది.

Zoonotic Langya Virus: చైనాను వణికిస్తున్న కొత్త రకం వైరస్.. భయంతో వణికిపోతున్న ప్రజలు

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

 

తెలంగాణ కరోనా బులెటిన్..