Telangana Corona News : తెలంగాణకు రిలీఫ్.. భారీగా తగ్గిన కరోనా కేసులు

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 36వేల 692 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 31వేల 830 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 751కి తగ్గింది.

Telangana Corona News : తెలంగాణకు రిలీఫ్.. భారీగా తగ్గిన కరోనా కేసులు

Telangana Corona News : తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తక్కువ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతుండటం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 7వేల 007 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 71 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 47 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 7 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 88 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసులకంటే కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటం రిలీఫ్ ఇచ్చే అంశం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 36వేల 692 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 31వేల 830 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 751కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 9వేల 450 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 99 మందికి పాజిటివ్ గా తేలింది.

తెలంగాణ కరోనా బులెటిన్..