Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 37వేల 326 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 32వేల 510 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 705కి తగ్గింది.

Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..

Telangana Covid News : తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తక్కువ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతుండటం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 9వేల 765 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 99 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 50 కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 7 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 6 కేసులు, ఖమ్మం జిల్లాలో 6 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 99 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసులతో సమానంగా కోలుకున్న వారి సంఖ్య ఉండటం రిలీఫ్ ఇచ్చే అంశం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 37వేల 326 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 32వేల 510 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 705కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 10వేల 044 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 103 మందికి పాజిటివ్ గా తేలింది.

తెలంగాణ కరోనా బులెటిన్..