Telangana EAMCET Counseling : తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుద‌ల అయింది. తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇంజినీరింగ్‌లో 80.41 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్‌లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్ ఫ‌లితాలు విడుద‌లైన నేప‌థ్యంలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా ఇవాళ విడుద‌ల చేశారు. మూడు విడ‌త‌ల్లో కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్నారు.

Telangana EAMCET Counseling : తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదల

Telangana EAMCET Counseling (2)

Telangana EAMCET Counseling : తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుద‌ల అయింది. తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇంజినీరింగ్‌లో 80.41 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్‌లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్ ఫ‌లితాలు విడుద‌లైన నేప‌థ్యంలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా ఇవాళ విడుద‌ల చేశారు. మూడు విడ‌త‌ల్లో కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్నారు.

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలను జులై 18 నుంచి 21 వరకు నిర్వహించారు. మొత్తం 1,72,243 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అందులో 1,56,860 మంది ప‌రీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,26,140 మంది ఉత్తీర్ణత (80.41 శాతం) సాధించారు. అలాగే అగ్రికల్చర్‌, మెడికల్‌ స్ట్రీమ్‌కు 94,476 మంది దరఖాస్తు చేసుకోగా, 80,575 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. వీరిలో 71,180 మంది విద్యార్థులు (88.34 శాతం) అర్హత సాధించారు.

TS EAMCET: తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల.. ఏపీ విద్యార్థినికి మొదటి ర్యాంకు

మొద‌టి విడుత షెడ్యూల్..
ఆగ‌స్టు 21 నుంచి 29 వరకు ఆన్ లైన్ స్లాట్ బుకింగ్
ఆగ‌స్టు 23 నుంచి 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన
ఈనెల 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు
సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు

రెండో విడుత షెడ్యూల్..
సెప్టెంబరు 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్ లు
సెప్టెంబరు 30న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన
సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు
అక్టోబరు 4న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు

Gilli Danda: ‘ఖోఖో, గిల్లీ దండా’తోపాటు 75 క్రీడలకు స్కూళ్లలో చోటు.. కేంద్రం నిర్ణయం

మూడో విడుత షెడ్యూల్..
అక్టోబరు 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్
అక్టోబరు 13న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన
అక్టోబరు 11 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
అక్టోబరు 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
అక్టోబరు 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ