Corona Vaccination : సెప్టెంబర్ 10లోగా అందరికీ టీకాలు ఇవ్వాలి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

వ్యాక్సినేషన్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో 18ఏళ్లు దాటిన విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బందికి కరోనా వ్యాక్సిన్..

Corona Vaccination : సెప్టెంబర్ 10లోగా అందరికీ టీకాలు ఇవ్వాలి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

Corona Vaccination

Corona Vaccination : వ్యాక్సినేషన్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో 18ఏళ్లు దాటిన విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 10లోగా వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆదేశించారు. టీకాల కోసం ప్రధానోపాధ్యాయులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. టీకా పంపిణీపై రోజువారీగా నివేదికలు అందజేయాలన్నారు.

Nokia 3310 : మార్కెట్లోకి వచ్చి 21 ఏళ్లు.. నాటి రోజులు గుర్తుచేసుకుంటున్న నెటిజన్లు

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ, పంచాయతీ అధికారులతో పాఠశాలల పున:ప్రారంభంపై సీఎస్‌ సమీక్షించారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఉపాధ్యాయులతో పాటు బోధనేతర సిబ్బంది, స్కూల్ బస్ డ్రైవర్లు, మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది అందరికీ టీకాలు వేయించాలని అధికారులకు సీఎస్‌ స్పష్టం చేశారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు, కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నట్లుగా పాఠశాలల దగ్గర బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. స్కూళ్లలో పూర్తి స్థాయిలో కొవిడ్ నిబంధనలు పాటించాలని, పరిశుభ్రత చర్యలు చేపట్టాలని తెలిపారు.

Aadhaar number: మీ ఆధార్‌తో లింకింగ్ ఉన్న ఫోన్ నెంబర్ల గురించి తెలుసుకోండిలా..

విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే పరీక్షలు చేయించాలన్నారు. మధ్యాహ్న భోజనం విషయంలో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల సిబ్బంది, వారితో సంబంధం ఉన్న వారికి టీకాలు వేయించేందుకు ఆర్బీఎస్కే వాహనాలను వినియోగించుకోవాలని సీఎస్ చెప్పారు. విద్యార్థి, ఉపాధ్యాయుడు, పాఠశాల సిబ్బంది ఎవరిలోనైనా కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే, ఆ వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రి లేదా పీహెచ్‌సీకి తీసుకెళ్లి కరోనా టెస్ట్ చేయించాలన్నారు.