మీలో ఎవరు మాస్క్ మహారాజు ? కరోనా అంతం చేద్దాం, తెలంగాణ ప్రభుత్వం ప్రచారం

  • Published By: madhu ,Published On : October 19, 2020 / 11:16 AM IST
మీలో ఎవరు మాస్క్ మహారాజు ? కరోనా అంతం చేద్దాం, తెలంగాణ ప్రభుత్వం ప్రచారం

Telangana Govt Guidelines : మీలో ఎవరు మాస్క్ మహారాజు ? కరోనా ఖేల్ ఖతం చేద్దాం..ప్రతి ఇంటా సంబురాలు చేసుకుందాం..అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేపడుతోంది. తెలంగాణ యాసతో కూడుకున్న నినాదాలు, ప్రత్యేక పాటలను ప్రభుత్వం సిద్ధం చేసింది.



నినాదాలతో కూడిన పోస్టర్లను అధికారులు విడుదల చేశారు. ఈ పండుగ వేళ మన శుభ్రతే మన భద్రత’, ‘కరోనాఖేల్‌ ఖతం చేద్దాం.. ప్రతీ ఇంట్ల సంబురాలు షురూ చేద్దాం’ కరోనా సురుని పై సంధించిన మూడు బాణాలు., సంబరాలలో పాటించండి ఆరు అడుగుల దూరం, కరోనాని పెట్టండి ఆమడ దూరం, ముఖంపై మాస్క్ ఉంచండి, సబ్బుతో చేతులు కడగండి, ఆరడుగుల దూరం పాటించండి, కరోనా మహమ్మారిని దంచండి, ‘మీలో ఎవరు మాస్క్‌ మహారాజు?’ అంటూ వివిధ పోస్టర్లను తీర్చిదిద్దారు.



‘మాస్క్‌ మహారాజు ఎప్పుడూ సరిగ్గా మాస్క్‌ వేసుకుంటడు’, ‘చేతులు సబ్బుతో మంచిగా శుభ్రం చేసుకుంటడు’, ‘గుంపులల్ల దూరడు… ఆరడుగుల దూరం పాటిస్తడు’, ఇవన్నీ మీరు చేస్తుంటే మీరే మాస్క్‌ మహారాజు..అంటూ పోస్టర్లలు తయారు చేశారు.



ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తోంది. దీంతో ప్రజలు గుమికూడా ఉండేందుకు, తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ..పోస్టర్లను తయారు చేయడం జరిగిందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇంట్లోనే పండుగలు జరుపుకోవాలని, వర్షాలు, వరదల కారణంగా రోగాలు ముసిరే ప్రమాదం ఉన్నందున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.