High Court Key Judgment : తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపు రద్దు.. ఏపీకి వెళ్లిపోవాలంటూ హైకోర్టు ఆదేశం

తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. సీఎస్ సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసింది.

High Court Key Judgment : తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపు రద్దు.. ఏపీకి వెళ్లిపోవాలంటూ హైకోర్టు ఆదేశం

SOMESH KUMAR

High Court Key Judgment : తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. సీఎస్ సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసింది. ఏపీకి వెళ్లిపోవాలంటూ హైకోర్టు ఆదేశించింది. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. డీవోపీటీ పిటిషన్ పై హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర విభజన సమయంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లను వివిధ ప్రాంతాలకు అనగా ఏపీ, తెలంగాణకు కేటాయిస్తూ గతంలో కేంద్ర డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీని సవాల్ చేస్తూ గతంలో సీఎస్ సోమేశ్ కుమార్ తెలంగాణలోనే కొనసాగుతానంటూ కేంద్ర పరిపాలన ట్రైటునల్ (సీఏటీ)ను కోరారు. ఈ మేరకు గతంలో ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సీఏటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2017లో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టు సీజే తుది తీర్పు ఇచ్చింది.

Hyd Fire Accident: బోయిగూడ ఘటనపై సీఎస్ సోమేశ్ కుమార్ రియాక్షన్

సీఏటీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ తీర్పు అమలుపై దాదాపు మూడు వారాల సమయం ఇచ్చింది. మొదట అభ్యర్థనను తిరస్కరించినా
సోమేశ్ కుమార్ తరపు కౌన్సిల్ కోర్టును విన్నవించిన నేపథ్యంలో ఈ తీర్పు అమలుకు మూడు వారాల సమయం ఇచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ సోమేశ్ కుమార్ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సివుంటుంది.