Minister KTR : కేంద్రమంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

విషం చిమ్మడం, పత్తా లేకుండా పోవడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ అస్థిత్వాన్ని కూడా ప్రశ్నించడం బీజేపీకే చెల్లిందని పేర్కొన్నారు. తెలంగాణ సమాజం ముక్తకంఠంతో నిరిసిస్తున్న అంశాలను మీ దృష్టికి తీసుకొస్తున్నట్లు తెలిపారు.

Minister KTR : కేంద్రమంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

Ktr Letter

Minister KTR : కేంద్రమంత్రి అమిత్ షాకు తెలంగాణ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. అమిత్ షాకు కేటీఆర్ 27 ప్రశ్నలు సంధించిచారు. తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. 8 ఏళ్లుగా తెలంగాణ పట్ల కేంద్ర కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం కడుపు నింపుతున్న తెలంగాణ కడుపును కొట్టడం మానడం లేదని విమర్శించారు.

విషం చిమ్మడం, పత్తా లేకుండా పోవడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ అస్థిత్వాన్ని కూడా ప్రశ్నించడం బీజేపీకే చెల్లిందని పేర్కొన్నారు. తెలంగాణ సమాజం ముక్తకంఠంతో నిరిసిస్తున్న అంశాలను మీ దృష్టికి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఎంత ప్రశ్నించినా మీ వైఖరి మారదని తెలంగాణ సమాజం విశ్వసిస్తుందన్నారు.

Minister KTR : బండి సంజయ్ పై పరువునష్టం దావా వేసిన మంత్రి కేటీఆర్

విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ మీ ప్రభుత్వం నెరవేర్చిందా? గుజరాత్ లో మాత్రం కోచ్ ఫ్యాక్టరీ ఎలా వచ్చింది? కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టరో చెప్పగలరా? డిమాండ్ లేదంటూ ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై చేతులు దులుపుకోలేదా? తెలంగాణకు విద్యా సంస్థలను ఎందుకు కేటాయించడం లేదు కేంద్రం ఒక్క ప్రతిష్టాత్మక విద్యా సంస్థనైనా తెలంగాణకు కేటాయించిందా? మీరు అధికారంలోకి వచ్చాక తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ అయినా ఇచ్చారా? ఐటీ అభివృద్ధి కోసం సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ ఎందుకు ఇవ్వటం లేదు? అని ప్రశ్నించారు.

హైదరాబాద్ ఫార్మా సిటీకి మీరు చేస్తున్న సాయమేంటి? తెలంగాణకు డిఫెన్స్ కారిడార్ ఎందుకు మంజూరు చేయరు? కేంద్ర ప్రభుత్వ కుట్రలకు ఐటీఆర్ రద్దు పరాకాష్ట కాదా? పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీని ఎందుకు తుప్పు పట్టించారు? పారిశ్రామిక రాయితీలను తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు? అని నిలదీశారు. తెలంగాణ పట్ల చిత్తిశుద్ధి ఉంటే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.