Telangana:‘ఉగాది తరువాత ఉద్యమం ఉగ్రరూపం ఏంటో చూపిస్తాం..డెడ్‌లైన్‌ ఫిక్స్‌..కౌంట్‌డౌన్‌ స్టార్ట్’ఢిల్లీలోరచ్చకు TRS రెఢీ

ఉగాది తరువాత ఉద్యమం ఉగ్రరూపం ఏంటో చూపిస్తాం..డెడ్‌లైన్‌ ఫిక్స్‌..కౌంట్‌డౌన్‌ స్టార్ట్.. అంటూ తెలంగాణ మంత్రులు కేంద్ర ప్రభుత్వానికి ఇంటిమేషన్ ఇచ్చారు. ఢిల్లీలో ఉద్యమానికి TRS రెడీ.

Telangana:‘ఉగాది తరువాత ఉద్యమం ఉగ్రరూపం ఏంటో చూపిస్తాం..డెడ్‌లైన్‌ ఫిక్స్‌..కౌంట్‌డౌన్‌ స్టార్ట్’ఢిల్లీలోరచ్చకు TRS రెఢీ

Telangana Ministers Fire On Bjp Politics..protest In Delhi After Ugadi

Telangana: తెలంగాణ‌లో పండించిన ధాన్యం కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతోంది. తెలంగాణలో రైతులు పండించి వరి ధాన్యం కొంటారో లేదో అనే విషయంపై దేశ రాజధాని ఢిల్లీలోనే తేల్చుకుంటాం అంటున్నారు గులాబీ నేతలు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాది రైతులు సంవత్సరానికి పైగా ఉద్యమం చేసిన విషయం తెలిసిందే. ఇటువంటి తరహాలో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమం చేయటానికి పక్కాగా రెడీ అవుతోంది.

ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం వైఖరిపై టీఆర్ఎస్ ఆందోళనలకు కొనసాగిస్తోంది. రాష్ట్ర వ్వ్యాప్తంగా యాసింగి ధాన్యం కొనాలంటూ గ్రామాలు,మండలాల స్థాయిలో తీర్మానాలు కూడా చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈక్రమంలో తెలంగాణ మంత్రులు వరుసగా మీడియా సమావేశాలు పెట్టి బీజేపీపై విమర్శలు సంధిస్తున్నారు. దీంట్లో భాగంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనమంటే తెలంగాణ ప్రజలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవమానిస్తున్నారంటూ మండిపడ్డారు.

Also read :  Telangana : పండిన ధాన్యం కొనమంటే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా? ధాన్యం కొనేవరకు పోరాటం ఆగదు

ఉగాది త‌ర్వాత నూక ఎవ‌రో.. పొట్టు ఎవ‌రో తేలుస్తాం : మంత్రి పువ్వాడ‌
బీజేపీపై మండిపడే క్రమంలో తెలంగాణ మరో మంత్రి మంత్రి పువ్వాడ అజ‌య్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తార‌ు అంటూ తీవ్రస్థాయిలో బీజేపీపై విరుచుకుపడ్డారు. ఉగాది వరకు ప్రశాంతంగా కేంద్రానికి నిరసనలు, వినతులు తెలుపుతామ‌న్నారు. ఉగాది త‌ర్వాత నూక ఎవ‌రో, పొట్టు ఎవ‌రో తేలుస్తామ‌ని తేల్చిచెప్పారు. సికింద్రాబాద్ ప్ర‌జ‌ల‌కు కిష‌న్ రెడ్డి నూక‌లు తినిపించి చూడాలి. లేదా పీయూష్ గోయ‌ల్‌తో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పించాల‌ని అజ‌య్ కుమార్ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు సమస్యను అర్ద్రతతో కూడిన హృదయంతో చూడాలన్నారు. రాజకీయ కోణంలో, రాజకీయ కక్ష్యతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాం అని భావిస్తే అది శునకానందమే అవుతుందని మంత్రి పువ్వాడ స్ప‌ష్టం చేశారు.

Also read : Paddy Issue : పీయూష్ గోయల్‌‌కు మంత్రి ఎర్రబెల్లి సవాల్

డెడ్‌లైన్‌ ఫిక్స్‌ చేశాం.. కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది…
డెడ్‌లైన్‌ ఫిక్స్‌ చేశాం.. కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది… ఉగాదిలోపు ధాన్యం కొనుగోళ్లపై వెనక్కి తగ్గితే ఓకే.. లేదంటే ఉగాది తర్వాత మీరు చూసేది ఉగ్ర తెలంగాణే అంటూ కేంద్రానికి డెడ్లీ వార్నింగ్‌ ఇచ్చారు తెలంగాణ మంత్రులు. ఇప్పటి వరకు విజ్ఞప్తులు చేశాం.. విన్నవించుకున్నాం.. లేఖలు రాశాం.. అధికారులను పంపాం.. స్వయంగా ఢిల్లీకి వెళ్లి కలిశాం.. అయినా కేంద్రం తెలంగాణను, తెలంగాణ రైతులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తెలంగాణ రైతాంగం కోసం ఇప్పటి వరకు ఎంతో సంయమనంతో వేచి చూశాం.. కానీ ఇకపై అలా జరగదంటున్నారు. ఉగాది వరకు ఓ లెక్క.. ఉగాది తర్వాత మరో లెక్క అంటూ కేంద్రానికి అల్టిమేటమ్‌ ఇచ్చారు. తెలంగాణ మంత్రులు. మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ క‌లిసి తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Also read :  TRS : కేంద్రంపై రెండువైపులా టీఆర్ఎస్ దాడి.. ఇటు ఢిల్లీలో అటు గల్లీలో

కాగా..మరికొన్ని రోజుల్లో తెలంగాణలో వరికోతలు ప్రారంభం కానున్నాయి.. ఆ లోపు ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రాన్ని ఒప్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు, తెలంగాణపై చూపిస్తున్న వివక్ష కారణంగా ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయంటున్నారు తెలంగాణ మంత్రులు. అంతేగాకుండా ఢిల్లీలో తమను, తెలంగాణ సమాజాన్ని అవమానపరిచారంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని కేంద్రమంత్రులతో సహా ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లామంటున్నారు తెలంగాణ మంత్రులు. ప్రస్తుతం బాల్‌ కేంద్రం కోర్టులో ఉందని.. ఇప్పటికైనా కేంద్రం రాజకీయాలను పక్కన పెట్టి..రాష్ట్ర రైతాంగం గురించి ఆలోచించాలని కోరుతున్నారు. అయితే ఉగాదిలోపు కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ రైతాంగానికి నష్టం తప్పదని.. అదే జరిగితే ఊరుకునేది లేదంటున్నారు.

Also read : Telangana : ధాన్యం దంగల్-తెలంగాణ, కేంద్రం మధ్య ముదురుతున్న వార్‌

గతంలో కొందరు బీజేపీ నేతలు పండిన ప్రతి గింజ కొనేలా చేస్తామని సవాళ్లు చేశారని.. ఇప్పుడు కేంద్రం చేస్తున్న ప్రకటనలపై మాత్రం నోరు మెదపడం లేదంటూ కమలనాథులపై ఫైర్‌ అవుతున్నారు.
మరోవైపు ఉగాది తర్వాత కేంద్రంపై చేసే పోరాటానికి ఇప్పటికే సీఎం కేసీఆర్‌ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు. దశల వారీగా ఆందోళనను ఉధృతం చేస్తామని.. అన్నదాతలందరూ ఉద్యమంలో పాల్గొనేలా కసరత్తు చేస్తున్నారు. ఏదేమైనా తెలంగాణ మంత్రుల ఆవేశాన్ని చూస్తుంటే.. ఉగాదిలోపు కేంద్రం దిగిరాకపోతే మాత్రం ఢిల్లీ పెద్దలకు మరోసారి తెలంగాణ పోరాట సెగ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.