Telangana Covid News Updated : తెలంగాణలో కరోనా కల్లోలం.. మరోసారి వందకు పైనే కేసులు

నేటివరకు రాష్ట్రంలో 7లక్షల 94వేల 584 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 89వేల 357 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1116.(Telangana Covid News Updated)

Telangana Covid News Updated : తెలంగాణలో కరోనా కల్లోలం.. మరోసారి వందకు పైనే కేసులు

Telangana Covid Report

Telangana Covid News Updated : తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో మరోసారి 100కు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 13వేల 015 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 126 మందికి పాజిటివ్ గా తేలింది. హైదరాబాద్ లో అత్యధికంగా 75 కేసులు వచ్చాయి. ఒక్కరోజు వ్యవధిలో మరో 49 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

నేటివరకు రాష్ట్రంలో 7లక్షల 94వేల 584 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 89వేల 357 మంది కోలుకున్నారు. కరోనా కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,116కి పెరిగింది. నేటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 13వేల 254 కరోనా పరీక్షలు చేయగా.. 129 మందికి పాజిటివ్ గా తేలింది.(Telangana Covid News Updated)

Heart Gel : ఒక్క జెల్‌తో గుండె సమస్యలకు పరిష్కారం..UK పరిశోధకుల ఘనత

కాగా, వందకు పైనే కరోనా కేసులు నమోదవడం ఇది వరుసగా 6వ రోజు. జూన్ 6వ తేదీన 65 కరోనా కేసులు నమోదవగా.. జూన్ 7న 119 కేసులు వచ్చాయి. జూన్ 9న 122 కేసులు, జూన్ 10న 155 కేసులు, జూన్ 11న 145 కేసులు, జూన్ 12న 129 కేసులు వచ్చాయి.

Covid Test: అమెరికా వచ్చే వాళ్లకు కోవిడ్ టెస్ట్ నిబంధన ఎత్తివేత

అటు, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మరోరోజు కొత్త కేసులు 8వేల పైనే నమోదయ్యాయి. రోజురోజుకూ పెరుగుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య ఆందోళనకు గురి చేస్తోంది.

ఆదివారం 2.49 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 8వేల 084 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దాంతో పాజిటివిటీ మూడు శాతం దాటి..3.24 శాతంగా నమోదైంది. ముందురోజు అది 2.71 శాతంగా ఉంది. ప్రస్తుతం కేసుల పెరుగుదలకు మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ ప్రధానంగా దోహదం చేస్తున్నాయి. దాదాపు ఆరు వేల కేసులు ఇక్కడి నుంచే వచ్చాయి.(Telangana Covid News Updated)

కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 47వేల 995కి చేరి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. యాక్టివ్ కేసుల రేటు 0.11 శాతానికి చేరింది.

ఇప్పటివరకూ 4.32 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 4.26 కోట్ల మందికిపైగా కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 4వేల 592 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. కొత్త కేసులు, కోలుకుంటున్న వారి మధ్య ఉన్న భారీ అంతరం కారణంగా రికవరీ రేటు 98.68 శాతానికి పడిపోయింది. 24 గంటల్లో మరో 10 మంది కొవిడ్ తో మరణించారు. ఇక నిన్న 11.77 లక్షల మంది టీకా తీసుకోగా.. 195 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.