Telangana RTC Buses: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు, అలారంలు.. ప్రయోగాత్మకంగా అమలు

తెలంగాణ బస్సుల్లో ఇకపై సీసీ కెమెరాలు, అలారంలు కనిపించబోతున్నాయి. ఇప్పటికే కొన్ని బస్సుల్లో ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేశారు. రాబోయే రెండు నెలల్లో మరిన్ని బస్సుల్లో ఏర్పాటు చేస్తారు.

Telangana RTC Buses: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు, అలారంలు.. ప్రయోగాత్మకంగా అమలు

Telangana RTC Buses: ప్రయాణికుల భద్రతపై తెలంగాణ ఆర్టీసీ మరింత దృష్టి పెట్టింది. ‘ఐరాస్తే’ కార్యక్రమంలో భాగంగా కొన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, అలారంలు ఏర్పాటు చేయబోతున్నారు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ఇంటెల్, ఐఎన్ఏఐ, టీఎస్ ఆర్టీసీ కలిపి ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేశారు.

Arvind Kejriwal: ఉచితంగా అందించే విద్య, వైద్యం తాయిలాలు కావు: అరవింద్ కేజ్రీవాల్

డ్రైవర్ క్యాబిన్‌లో ఒక అలారం, ఒక సెన్సర్, మూడు కెమెరాలు ఉంటాయి. ఏదైనా వాహనాన్ని ఢీకొనే పరిస్థితి వస్తే ఇవి హెచ్చరిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏడీఏఎస్ టెక్నాలజీ ద్వారా.. కెమెరా గ్రహించే దృశ్యాల్ని విశ్లేషించి, అలారం పని చేస్తుంది. కెమెరాల ఆధారంగా సెంట్రల్ సర్వర్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. సికింద్రాబాద్ డిపో నుంచి హైవేలపై ప్రయాణించే 12 బస్సులలో ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

Jawans killed: నదిలో పడ్డ బస్సు.. ఆరుగురు ఐటీబీపీ జవాన్ల మృతి

రాబోయే రెండు నెలల్లో 200కు పైగా బస్సుల్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఒక్కో బస్సులో ఈ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు మూడు గంటల సమయం పడుతుంది.