Arvind Kejriwal: ఉచితంగా అందించే విద్య, వైద్యం తాయిలాలు కావు: అరవింద్ కేజ్రీవాల్

కనీస అవసరాలైన విద్య, వైద్యం పేదలకు ఉచితంగా అందించడం తాయిలాల కిందకు రావని అభిప్రాయపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దేశంలో ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, నాణ్యమైన వైద్య సేవలు అందాలని ఆకాంక్షించారు.

Arvind Kejriwal: ఉచితంగా అందించే విద్య, వైద్యం తాయిలాలు కావు: అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal: పేదలకు అందించే నాణ్యమైన విద్య, వైద్యం ఉచిత పథకాల కిందకు రావని అభిప్రాయపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మంగళవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో తన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాల గురించి వివరించారు.

Jawans killed: నదిలో పడ్డ బస్సు.. ఆరుగురు ఐటీబీపీ జవాన్ల మృతి

‘‘పేదలకు అందించే విద్య, వైద్యంలాంటి కనీస అవసరాలు ఉచిత తాయిలాలు కావు. దేశంలో ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, నాణ్యమైన వైద్య సేవలు అందాలి. ఢిల్లీలో ఐదేళ్లలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం. ఈ వ్యవస్థను మార్చాల్సి ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రైవేటు వైద్య సంస్థలకు మేలు చేయడం కోసం.. ప్రభుత్వ ఆస్పత్రుల్ని సరిగ్గా నిర్వహించడం లేదు. ఇంకొందరు ఐదు లక్షల ఉచిత వైద్య బీమా పథకాన్ని అందిస్తున్నారు. ఈ బీమా పథకాన్ని వినియోగించుకునేందుకు ఆస్పత్రులు లేనప్పుడు ఆ పథకం ఉండి ఏం ప్రయోజనం. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ప్రభుత్వ ఆస్పత్రులు లేవు. ఢిల్లీలో ప్రతి పౌరుడి ఆరోగ్యంపై సగటున రెండు వేల రూపాయలు ఖర్చుపెడుతున్నాం. దేశంలో విద్యావ్యవస్థను బాగు చేయాలంటే ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలను తిరిగి నిర్మించాలి.

Kashmiri Pandit: తీవ్రవాదుల దుశ్చర్య.. కాశ్మీరీ పండిట్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదులు

మరిన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించాలి. తాత్కాలిక ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలి. ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ అందించాలి. ఢిల్లీ ప్రభుత్వంలాగే ఉపాధ్యాయుల్ని విదేశాలకు పంపించి మరీ ట్రైనింగ్ ఇప్పించాలి’’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు కేజ్రీవాల్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించారు.