Kashmiri Pandit: తీవ్రవాదుల దుశ్చర్య.. కాశ్మీరీ పండిట్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదులు

జమ్ము-కాశ్మీర్‌లో తీవ్రవాదులు దురాగతానికి పాల్పడ్డారు. ఒక కాశ్మీరీ పండిట్‌ను కాల్చి చంపారు. ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్రవాదుల కోసం గాలిస్తున్నారు.

Kashmiri Pandit: తీవ్రవాదుల దుశ్చర్య.. కాశ్మీరీ పండిట్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదులు

Kashmiri Pandit: జమ్ము-కాశ్మీర్‌లో తీవ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఒక కాశ్మీరీ పండిట్‌ను కాల్చి చంపారు. ఈ ఘటనలో అతడి సోదరుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన షోపియాన్ జిల్లా, యాపిల్ ఆర్కిడ్ ప్రాంతంలోని చోటిపొరాలో మంగళవారం జరిగింది.

Chinese Ship: శ్రీలంక పోర్టుకు చేరుకున్న చైనా నిఘా నౌక.. భారత ఆందోళన బేఖాతరు

కాశ్మీర్ పండిట్లు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో స్థానికులను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. అందులో ఒక కాశ్మీరీ పండిట్ అక్కడే మరణించాడు. అతడి సోదరుడు గాయపడ్డాడు. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని సునీల్ కుమార్‌గా, అతడి సోదరుడిని పింటూ కుమార్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని సైన్యం అదుపులోకి తీసుకుంది. తీవ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. కొంతకాలంగా కాశ్మీర్ లోయలో పండిట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. మరోవైపు ఈ అంశంపై ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీజేపీపై విమర్శలు చేశారు.

Jawans killed: నదిలో పడ్డ బస్సు.. ఆరుగురు ఐటీబీపీ జవాన్ల మృతి

‘‘జమ్ము-కాశ్మీర్‌లో మోదీ నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్, పాలకవర్గం విఫలమైంది. కాశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించలేకపోతోంది. అక్కడ వారికి భద్రత లేదు. ఆర్టికల్ 370 రద్దు చేస్తే వారంతా సురక్షితంగా ఉంటారని చెప్పారు. కానీ, అలా జరగడం లేదు. దీనిపై ప్రధాని మోదీ, హోం మంత్రి, బీజేపీ సమాధానం చెప్పాలి’’ అని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.