Chinese Ship: శ్రీలంక పోర్టుకు చేరుకున్న చైనా నిఘా నౌక.. భారత ఆందోళన బేఖాతరు

భారత అభ్యంతరాల్ని పట్టించుకోకుండా చైనా నౌక శ్రీలంకలోని హంబన్‌తోట పోర్టుకు చేరుకుంది. మంగళవారం ఉదయం ఈ నౌక శ్రీలంక తీరంలో అడుగుపెట్టింది. మన రక్షణ వ్యవస్థ ఈ నౌక నిఘా పరిధిలోకి వస్తుందని అంచనా.

Chinese Ship: శ్రీలంక పోర్టుకు చేరుకున్న చైనా నిఘా నౌక.. భారత ఆందోళన బేఖాతరు

Chinese Ship: భారత్ ఆందోళనల్ని బేఖాతరు చేస్తూ చైనా నిఘా నౌక ‘యువాన్ వాంగ్ 5’.. శ్రీలంకలోని హంబన్‌తోట పోర్టుకు చేరుకుంది. ఇది చైనా రూపొందించిన నిఘా నౌక కావడంతో భారత్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు అమెరికా కూడా భారత వాదనకు మద్దతుగా నిలిచింది. దీంతో ఈ నెల 11న రావాల్సిన నౌక.. కాస్త ఆలస్యంగా మంగళవారం ఉదయం పోర్టుకు చేరుకుంది.

FIFA: ఏఐఎఫ్ఎఫ్‌పై ఫిఫా నిషేధం.. దేశంలో ఫుట్‌బాల్ వరల్డ్ కప్ నిర్వహణ డౌటే!

భద్రతా కారణాల రీత్యా ఈ నౌకను అనుమతించవద్దని భారత్.. శ్రీలంకను కోరింది. దీంతో మొదట్లో శ్రీలంక కూడా చైనా నౌక తమ జలాల్లోకి రావడానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, భారత్‌కు ప్రమాదం ఉందన్న వాదనలో నిజం లేదని చైనా ప్రభుత్వం వాదించింది. అలాంటి అనుమానాలు అవసరం లేదని చెప్పింది. దీంతో చివరి నిమిషంలో చైనా నౌకకు శ్రీలంక అనుమతించింది. ఈ నౌక ద్వారా భారత్‍‌కు మాత్రమే కాకుండా, శ్రీలంకకు కూడా ప్రమాదమే అన్నది విశ్లేషకుల అంచనా. చైనా నిఘా నౌకను భారత్ అడ్డుకోవడానికి కారణాలున్నాయి. మన దేశంలోని కీలకప్రాంతాలు ఆ నౌక నిఘా పరిధిలోకి వస్తాయి.

Mahindra Electric SUVs: మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ కార్లు.. కర్టైన్ రైజ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

భారత్ అభ్యంతరం దేనికి?
చైనా నౌకను భారత్ అడ్డుకోవడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. మన దేశంలో ఎలాంటి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినా ఆ విషయాన్ని చైనా నౌక పసిగడుతుంది. అందువల్ల మన మిస్సైల్స్ గురించిన సాంకేతికత ఆ దేశానికి తెలిసే వీలుంది. ఈ నౌకలో అత్యాధునిక సాంకేతికతను వాడారు. దీనివల్ల మన మిస్సైల్స్ రేంజ్ ఏంటో ఈ నౌక కచ్చితంగా గుర్తిస్తుంది. అయితే, తమ జలాల్లో అలాంటి పరీక్షలు జరిపేందుకు అనుమతివ్వలేదని శ్రీలంక తెలిపింది. ఈ నౌకకు సముద్ర భూభాగంలో సర్వే చేయగలిగే కెపాసిటీ కూడా ఉంది. అందువల్ల సముద్రంలో భారత్ ఏవైనా సబ్‌మెరైన్లు వాడితే, వాటి గురించి తెలిసే అవకాశం ఉంది.

Munugode: మునుగోడులో ఎన్నికల ఫీవర్.. నోటిఫికేషన్‌కు ముందే మారిన వాతావరణం

అయితే, అలాంటి వాటికి అనుమతివ్వడం లేదని, ఈ విషయాన్ని పరిశీలించేందుకు ఒక చైనా కంపెనీని ఏర్పాటు చేసినట్లు శ్రీలంక వెల్లడించింది. ఇది కూడా భారత్‌కు అభ్యంతరకరమే. మరోవైపు ఈ పోర్టును శ్రీలంక, చైనాకు 99 ఏళ్ల లీజుకు ఇచ్చింది. దీన్ని చైనా సైనిక కార్యకలాపాలకు వాడుకుంటే, అది మన దేశానికి ప్రమాదకరమని భారత్ భావిస్తోంది. శ్రీలంక ఒక పక్క భారత వ్యతిరేక చైనాకు అనుమతిస్తుంటే, భారత్ మాత్రం శ్రీలంకకు ఆర్థిక సాయం చేస్తూ అండగా నిలుస్తోంది.