Mahindra Electric SUVs: మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ కార్లు.. కర్టైన్ రైజ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీల్లో ఒకటైన మహీంద్రా అండ్‌ మహీంద్రా త్వరలో ఎలక్ట్రిక్‌ కార్ల విభాగంలోకి ప్రవేశించబోతుంది. రాబోయే నాలుగేళ్లలో ఐదు రకాల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఈ సంస్థ విడుదల చేయబోతుంది.

Mahindra Electric SUVs: మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ కార్లు.. కర్టైన్ రైజ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

Mahindra Electric SUVs: దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం&ఎం) ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి అడుగుపెట్టబోతుంది. ఈ సంస్థ నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కార్లు రాబోతున్నాయి. రాబోయే నాలుగేళ్లలో ఐదు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విడుదల చేయబోతున్నట్లు ఎం&ఎం ప్రకటించింది. ఇంగ్లో ప్లాట్‌ఫామ్‌పై వీటి కాన్సెప్ట్ కార్లను ఇటీవల ఆవిష్కరించారు.

Shivamogga: ఇరువర్గాల మధ్య ఫ్లెక్స్ తెచ్చిన వివాదం.. శివమొగ్గలో 144 సెక్షన్

ఈ కార్లకు సంబంధించిన టీజర్ వీడియోను ఎం&ఎం సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. 2024-2026 మధ్య దశలవారీగా ఈ కార్లు విడుదలవుతాయి. ఎక్స్‌యూవీ ఈ8, ఎక్స్‌యూవీ ఈ9, బీబీ.05, బీఈ.07, బీఈ.09 పేర్లతో ఈ వాహనాలు విడుదల కానున్నాయి. 2027 లోపు తమ సంస్థ రూపొందించే ఎస్‌యూవీల్లో పాతికశాతం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలే ఉంటాయని సంస్థ భావిస్తోంది. ఈ కార్లు అధునాతనంగా ఉన్నాయి. కస్టమర్‌ అభిరుచులకు సరిపడా రిక్లైనింగ్ సీట్లు ఉన్నాయి. ఎయిర్ కండిషనింగ్ కోసం పర్సనలైజ్డ్ సెట్టింగ్‌లు ఉన్నాయి. స్పష్టమైన కనెక్టివిటీ ఫీచర్‌ల కారణంగా కస్టమర్లు.. కాల్స్‌, టెక్స్ట్‌లు, మ్యూజిక్‌, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ యాక్సెస్ కూడా ఉంటుంది.

Munugode: మునుగోడులో ఎన్నికల ఫీవర్.. నోటిఫికేషన్‌కు ముందే మారిన వాతావరణం

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో లెదర్ సీట్లు, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉంటాయి. ఈ వాహనాల ధరలు రూ.25లక్షల నుంచి రూ.35 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఎం&ఎం సంస్థ ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో లేదు. కానీ, ఎలక్ట్రిక్ ఆటోల తయారీలో మాత్రం మొదటిస్థానంలో ఉంది. దేశంలోని ఎలక్ట్రిక్ ఆటోల్లో ఈ సంస్థ రూపొందించినవే 70 శాతం ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వాహన విభాగంలోకి ప్రవేశించేందుకు ఇదే సరైన సమయమని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అన్నారు.