TS RTC : మహిళలు చెయ్యి ఎక్కడ ఎత్తితే బస్సు అక్కడ ఆపాల్సిందే

తెలంగాణ ఆర్టీసీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలు చెయ్యి ఎత్తి బస్సు ఎక్కడ ఆపితే అక్కడ ఆపాలాగా చర్యలు తీసుకుంది.

TS RTC : మహిళలు చెయ్యి ఎక్కడ ఎత్తితే బస్సు అక్కడ ఆపాల్సిందే

Telangana Rtc

TS RTC Good news for womens:ఆర్టీసీ బస్. సామాన్యులకు అందుబాటు ధరల్లో ప్రయాణించే సౌకర్యం ఆర్టీసీ బస్సుకే చెల్లింది. ఉదయాన్నే డిపోల్లోంచి బయటకొచ్చే ఆర్టీసీ బస్సులు ప్రయాణీకుల కోసం సిద్ధంగా ఉంటాయి. ఇదిలా ఉంటే తెలంగాణ ఆర్టీసీ మహిళల కోసం ఓ కొత్త వెసులుబాటును కల్పించింది. నేటి మహిళలు ఉద్యోగం కోసం పలు రకాల ఉపాధుల కోసం ఉదయం లేచి ఇంటిపని చేసుకుని హడావిడిగా బయటకొచ్చి బస్సు ఎక్కుదామనుకుంటారు. అదే సమయంలో వారు ఎక్కాల్సిన రూట్ బస్సు దాటిపోతుంటాయి. అలాగే రాత్రి వరకూ పనిచేసి ఇల్లు చేరదామని అదే హడావిడితో పనిచేసే ప్రాంతాల నుంచి బయటకొస్తున్న సమయంలో బస్సులు దాటిపోయే సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఇటువంటివారి కోసం తెలంగాణ ఆర్టీసి వెలుసుబాటు కల్పిస్తూ..రాత్రి 7.30 గంటల తరువాత మహిళలు ఎక్కడ చెయ్యి ఎత్తి బస్సులు ఆపినా ఆర్టీసీ బస్సు ఆపాలనే వెలుసుబాటును కల్పించింది. దీనికి సంబంధించిన ఆర్టీసి డ్రౌవర్లకు..కండక్టర్లకు ఆదేశాలు జారి చేసింది. ఇది ఈరోజు నుంచే (జులై 6,2021)నుంచే అమలుకానుందని గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ వెసులుబాటులో ఇబ్బందులు ఎదురైతే మహిళలు 99592 26160, 99592 26154 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అలాగే ముఖ్యమైన బస్టాపుల్లో రాత్రి 10 వరకు బస్ులు నియంత్రణ అధికారాలుండేలా చర్యలు తీసుకున్నారు.

దీనికి సంబంధించి హైదరాబాద నగరంలోని 29 డిపోలకు చెందిన మేనేజర్‌లను ఆదేశించినట్లు చెప్పారు. మహిళా ప్రయాణికులు కోరిన చోట బస్సు ఆపకపోతే పైన తెలిపిన నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు. ఇది ఆర్టీసి కల్పిస్తున్న ఈ వెసులుబాటును మహిళలు వినియోగించుకోవాలని సూచించారు.