Ramappa Temple : రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం..కేంద్రానికి తెలంగాణ మంత్రుల వినతి

రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. కొత్తరాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించినప్పటినుంచి ఈ ప్రయత్నాలు మరింతగా పెరిగాయి. ఈక్రమంలో మరోసారి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు కోసం తెలంగాణ మంత్రులు, ఎంపీలు, కేంద్ర పర్యాటకశాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు.

Ramappa Temple : రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం..కేంద్రానికి తెలంగాణ మంత్రుల వినతి

Ramappa Temple (1)

unesco recognition for Ramappa temple : కాకతీయ సామ్రాజ్య ప్రాభవం గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. శతాబ్దాల చరిత్రగతన్న కాకతీయ సామ్రాజ్యం ఓ వెలుగు వెలిగింది. అలనాటి నాగరికతా వైభవానికి ప్రతీక ఈనాటికి ఠీవిగా నిలుస్తోంది రామప్ప దేవాలయం. అటువంటి రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. కేంద్రానికి పదే పదే విన్నవిస్తోంది. కొత్తరాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించినప్పటినుంచి ఈ ప్రయత్నాలు మరింతగా పెరిగాయి. ఈక్రమంలో మరోసారి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు కోసం తెలంగాణ మంత్రులు, ఎంపీలు, కేంద్ర పర్యాటకశాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు.

కాకతీయుల చారిత్రక సంపదకు నెలవైన రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మరోసారి విజ్ఞప్తిచేసింది. రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించటానికి కావాల్సిన ప్రక్రియ అంతా దాదాపుగా పూర్తి కావచ్చిందని.. ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేసి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపునకు కృషిచేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం..ఎంపీలు..పలువురు ఎంపీలు కోరుతూ..ఢిల్లీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పాటిల్‌ను కలిసి వినతిపత్రం అందించారు.

కాగా..రామప్ప దేవాలయాన్ని యునెస్కో అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆన్‌ మాన్యుమెంట్‌ అండ్‌ సైట్స్‌ (ఐకోమాస్‌) ప్రతినిధిగా వాసుపోశానందన్‌ 2019 సెప్టెంబరు 25న సందర్భించారు. దేవాలయాన్ని అణువణువు పరిశీలించారు. ఆ చరిత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు.

ప్రపంచ వారసత్వ కట్టడాల ప్రతిపాదనల ఆమోదంపై 2020 ఫిబ్రవరిలో 21 దేశాల ప్రతినిధుల సమావేశం చైనాలో జరగాల్సిఉన్న ఈ సమావేశం కరోనా మహమ్మారి కారణంగా వాయిదాపడింది. ఈక్రమంలో మరోసారి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతూ తెలంగాణ నేతలు, అధికారులు కేంద్రాన్ని కోరారు.