Heavy Rains In Telangana : తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి. మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Heavy Rains In Telangana : తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు

heavy rains in Telangana

Heavy Rains In Telangana : బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి. మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

పశ్చిమ బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంపు తిరిగి ఉంది.

Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ ఆరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం..

ఇది రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు వచ్చే అవకాశం ఉందని వివరించింది. వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.