Hyderabad Traffic: హైదరాబాద్‌లో మూడు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు… ఏయే ప్రాంతాల్లో అంటే..

హైదరాబాద్ మహా నగరంలో శుక్రవారం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫార్ములా-ఈ రేసింగ్ కోసం ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Hyderabad Traffic: హైదరాబాద్‌లో మూడు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు… ఏయే ప్రాంతాల్లో అంటే..

Hyderabad Traffic: హైదరాబాద్ మహా నగరంలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. నవంబర్ 18, శుక్రవారం నుంచి 20, ఆదివారం రాత్రి వరకు ఆంక్షలు కొనసాగుతాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫార్ములా ఈ-రేస్ హైదరాబాద్‌లో జరగనుంది.

Elon Musk: ట్విట్టర్‌కు త్వరలో కొత్త సీఈవో.. పదవికి గుడ్ బై చెప్పనున్న ఎలన్ మస్క్

మూడు రోజులపాటు ఈ రేసింగ్ జరగనుండటంతో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధానంగా ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ట్యాంక్‌బండ్ పరిసరాల్లోని పర్యాటక ప్రదేశాలను కూడా మూసివేయనున్నారు. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్కు వంటివి మూసి వేస్తారు. 21 నుంచి వీటిలోకి సందర్శకులను అనుమతిస్తారు. గ్రీన్‌ కో అనే సంస్థ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఫార్ములా -ఈ రేసింగ్‌ను నిర్వహిస్తుంది. ఈ నెల 19, 20వ తేదీల్లో హుస్సేన్ సాగ‌ర్ తీరంలో, రోడ్డుపై ఇండియ‌న్ రేసింగ్ లీగ్ ప్రారంభమవుతుంది. ఈ లీగ్ కోసం ఇప్పటికే ఈ ప్రాంతంలోని రోడ్లను రేసింగ్ ట్రాక్‌కు అనుకూలంగా మార్చారు. రేసింగ్ చూడటానికి వచ్చే ప్రేక్షకుల కోసం గ్యాలరీల్ని కూడా నిర్మిస్తున్నారు. ఈ పోటీల నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.

Koo: అమెరికాలో అడుగుపెట్టనున్న ‘కూ’.. ట్విట్టర్‌కు పోటీ ఇవ్వనున్న భారతీయ సంస్థ

ప్రధానంగా ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, తెలుగు త‌ల్లి జంక్షన్ వ‌ద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి. అలాగే ఖైరతాబాద్ జంక్షన్, ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌ జంక్షన్‌, రవీంద్ర భారతి జంక్షన్‌, మింట్‌ కాంపౌండ్‌, తెలుగు తల్లి జంక్షన్‌, నెక్లెస్‌ రోటరీ, నల్లగుట్ట జంక్షన్‌, లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ కట్టమైసమ్మ గుడి రూట్‌, ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ఆంక్షలు ఉంటాయి. అలాగే ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ మీదుగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వరకు వెళ్లే మార్గంతోపాటు నల్లగుట్ట జంక్షన్ నుంచి బుద్ధభవన్ వెళ్లే మార్గాల్ని పూర్తిగా మూసేస్తారు. ప్రసాద్ ఐ మాక్స్ సమీపంలోని జంక్షన్ నుంచి పీవీ నరసింహారావు మార్గ్‌ను నల్లగుట్ట జంక్షన్ వరకు పాక్షికంగా మూసివేస్తారు.