BJP Kishan Reddy : ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరు-కిషన్ రెడ్డి
కొత్త రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారమైందని BJP Kishan Reddy విమర్శలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం పోయి.. బీజేపీ ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

Kishan Reddy
BJP Kishan Reddy : తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ తాటాకు చప్పుళ్ళకు బీజేపీ భయపడదని కిషన్ రెడ్డి(BJP Kishan Reddy) అన్నారు.
కొత్త రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారమైందని ఆయన విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా కేసీఆర్ ను కాపాడలేరని కిషన్ రెడ్డి అన్నారు. కల్వకుంట్ల కుటుంబం పోయి.. బీజేపీ ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తన పాలనలో అన్ని వర్గాలను మోసం చేయటమే కేసీఆర్ తీసుకొచ్చిన గుణాత్మమైన మార్పు అని కిషన్ రెడ్డి అన్నారు. దళితులకు వెన్నుపోటు పొడవటం, సచివాలయానికి రాకుండా పాలన చేయటమే కేసీఆర్ గుణాత్మకమైన మార్పు అన్నారు.
భారత్ నుంచి బీజేపీని తరమికొట్టే దమ్ము భూప్రపంచంలో ఎవరికీ లేదన్నారు. వరి ధాన్యం కొనేది కేంద్రం మాత్రమేనని రైతులకు అర్థమైందన్నారు కిషన్ రెడ్డి. పొదుపు సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. బీజేపీపై కక్ష కట్టిన కుటుంబ పార్టీలకు బుద్ధి చెప్తామన్నారు కిషన్ రెడ్డి.
Minister Harish Rao : తెలంగాణ కోసం బీజేపీ ఏం చేసింది ? మంత్రి హరీష్ రావు
”సీఎం కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి ఖాయం. కల్వకుంట్ల కుటుంబం పోయి… బీజేపీ ప్రభుత్వం రావాలని తెలంగాణ సమాజం కోరుకుంటోంది. టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలను మోసం చేయటమే కేసీఆర్ తీసుకొచ్చిన గుణాత్మమైన మార్పు. సచివాలయానికి రాకుండా పాలన చేయటమే కేసీఆర్ తెచ్చిన గుణాత్మకమైన మార్పు. దళితులకు వెన్నుపోటు పొడవటం… నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కేసీఆర్ చెప్పే గుణత్మాకమైన మార్పు. కేసీఆర్ మాదిరిగా బీజేపీది కుటుంబ పార్టీ కాదు. దేశంలో కూడా కల్వకుంట్ల కుటుంబ పెత్తనం చేయాలని కేసీఆర్ కలలు కంటున్నారు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. రాష్ట్రం వచ్చాక బంగారు తెలంగాణ అయ్యిందో కాలేదో తెలియదు కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయ్యింది” అని కిషన్ రెడ్డి(Kishan Reddy) ఫైర్ అయ్యారు.
చాన్స్ చిక్కినప్పుడల్లా టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు కిషన్ రెడ్డి. ఓవైపు ప్రశ్నిస్తూ, విమర్శలు సంధిస్తున్నారు. మరోవైపు లేఖాస్త్రాలు వదులుతున్నారు. సీఎం కేసీఆర్‌కు వివిధ సమస్యలపై లేఖలు రాస్తూ వస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ముఖ్యంగా కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం గురించి.. కేంద్రం చేపట్టిన ప్రాజెక్టుల్లో రాష్ట్రం వాటా నిధుల వ్యవహారాన్ని ప్రశ్నిస్తూ వస్తున్న ఆయన.. రీసెంట్ గానే మరో లేఖ రాశారు.
Telangana Chief Minister : కేంద్రంపై కేసీఆర్ దూకుడు.. హైదరాబాద్ కేంద్రంగా రైతు, విద్యుత్ ఉద్యమాలు!
ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం రాష్ట్ర వాటా పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని లేఖలో సీఎం కేసీఆర్‌ను కోరారు కిషన్ రెడ్డి. ఆదిలాబాద్‌లోని ఆర్జీఐఎంఎస్ నిర్మాణానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర షేర్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి స్వాస్థ సురక్ష యోజన పథకం కింద రాష్ట్రం నుంచి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్ RGIMS గుర్తించి ఒక్కో కాలేజీకి రూ.120 కోట్లు కేంద్రం కేటాయించిందని.. కేంద్రం తన వాటా ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు లేఖలో తెలిపారు కిషన్ రెడ్డి. అంతేకాదు సిబ్బందిని కూడా తీసుకోవాలని కేసీఆర్‌ను కోరారు.