TSRTC : రూ. 100తో 24 గంటలు ప్రయాణించండి

పెట్రోల్ ధరలు పెరిగాయని ప్రజలు ఆందోళన చెందవద్దని..టీ 24 పేరిట 24 గంటల పాటు చెల్లుబాటు అయ్యేలా టికెట్ ను రూపొందించడం జరిగిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.

TSRTC : రూ. 100తో 24 గంటలు ప్రయాణించండి

T24 Ticket

T-24 Ticket : తెలంగాణ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ఎండీ వీసీ సజ్జనార్ నడుం బిగించారు. నష్టాల్లో కొనసాగుతున్న ఆర్టీసీని లాభాల బాట పట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎండీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత..సంస్థల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. బస్సుల్లో సాధారణ ప్రయాణీకుడిలా ప్రయాణించి…సమస్యలు తెలుసుకోవడం..బస్టాండుల్లో అకస్మిక తనిఖీలు చేయడం…పలు ఆదేశాలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read More : Oppo Reno 7 Series : ఒప్పో రెనో 7 సిరీస్ ఫుల్ ఫీచ‌ర్లు లీక్.. ధర ఎంతంటే?

ఆర్టీసీ ఎండీగా వినూత్నంగా నిర్ణయాలు తీసుకుంటూ..అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఆర్టీసీని సంస్థను లాభాల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తూనే…ప్రయాణీకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్న సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం రూ. 100 చెల్లించి..హైదరాబాద్ లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఓ ప్రకటనలో వెల్లడించారు.

Read More : Petrol Price : స్థిరంగా పెట్రోల్ ధరలు, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 114

పెరుగుతున్న పెట్రోల్ ధరల క్రమంలో..ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలు పెరిగాయని ప్రజలు ఆందోళన చెందవద్దని..ఆర్టీసీ బస్సులు ఉన్నాయంటూ వెల్లడించారు. టీ 24 పేరిట 24 గంటల పాటు చెల్లుబాటు అయ్యేలా టికెట్ ను రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ టికెట్ ధర రూ. 100గా ఉందని..ఈ టికెట్ ను తీసుకుని…ఆర్డినరీ, సబ్ ర్బన్, మెట్రో ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించవచ్చన్నారు. ఈ బస్సుల్లో 24 గంటల వ్యవధిలో ఎంత దూరమైనా ప్రయాణం చేయవచ్చని ఆయన సూచించారు. దీనివల్ల ప్రయాణీకులకు మరింత సౌకర్యం కల్పించినట్లవుతుందని భావిస్తున్నారు.