వాహనదారులకు బిగ్ షాక్ : బైక్ పై వెనుక కూర్చొన్నారా ? తాగి నడిపితే శ్రీకృష్ణ జన్మస్థానానికే

వాహనదారులకు బిగ్ షాక్ : బైక్ పై వెనుక కూర్చొన్నారా ? తాగి నడిపితే శ్రీకృష్ణ జన్మస్థానానికే

Warning to motorists : రోడ్డు ప్రమాదాలు పూర్తిస్థాయిలో నియంత్రించడంపై సైబారాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్‌ పెట్టారు. ఇందుకోసం ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరడా ఝలిపించడానికి సిద్ధమయ్యారు. టూ వీలర్‌ నడిపేవారితో పాటు వెనకాల కూర్చునే వారికి హెల్మెట్ తప్పనిసరి చేస్తున్నారు. హెల్మెట్ లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. మొదటిసారి హెల్మెట్‌ లేకుండా పట్టుబడితే మూడు నెలల పాటు లైసెన్స్‌ రద్దు, రెండోసారి కూడా హెల్మెట్‌ లేకుండా పట్టుబడితే శాశ్వతంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు.

మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్‌ 206 (4) ప్రకారం లైసెన్స్‌లను రద్దు చేస్తామన్నారు సైబరాబాద్ పోలీసులు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై దశల వారిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఏడాదిన్నరగా 3 వేల 500 మంది లైసెన్స్‌లు రద్దు చేశామన్నారు.. ఇక డ్రంక్‌ అండ్ డ్రైవింగ్‌లపై కూడా దృష్టి సారించామని.. తాగి వాహనాలు నడిపితే 10 ఏళ్ల పాటు శ్రీకృష్ణజన్మస్థానానికి పంపడం ఖాయమన్నారు పోలీసులు. హెల్మెట్ ధరించకపోతే ప్రమాదాలు జరిగినప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. కానీ కొందరి తీరులో మాత్రం మార్పు రావడం లేదు. దీంతో సైబరాబాద్‌ పోలీసులు అలాంటి వారికి బిగ్ షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.