KTR On Munugode By Election : వారి చేరికలతో లాభమే, మునుగోడులో భారీ మెజార్టీతో గెలుస్తాం-కేటీఆర్

రాజకీయంగా అప్పుడప్పుడు దారులు వేరవుతాయి, మళ్లీ కలుస్తాయి. స్వామి గౌడ్, శ్రావణ్ కుమార్, భిక్షమయ్య గౌడ్, పల్లె రవి రాక వల్ల పార్టీకి లాభం జరిగింది. దాని వల్ల చాలామంది సంతోషపడ్డారు. వారి చేరికల వల్ల వారికి లాభం, పార్టీకి కూడా లాభమే.

KTR On Munugode By Election : వారి చేరికలతో లాభమే, మునుగోడులో భారీ మెజార్టీతో గెలుస్తాం-కేటీఆర్

KTR On Munugode By Election : మునుగోడు ఉపఎన్నిక వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. బీజేపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఇటీవలే దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్, భిక్షమయ్య గౌడ్ కారెక్కిన సంగతి తెలిసిందే. మరికొందరు నేతలు కూడా బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.

10టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో టీఆర్ఎస్ లో చేరికలపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ”రాజకీయంగా అప్పుడప్పుడు దారులు వేరవుతాయి, మళ్లీ కలుస్తాయి. స్వామి గౌడ్, శ్రావణ్ కుమార్, భిక్షమయ్య గౌడ్, పల్లె రవి రాక వల్ల పార్టీకి లాభం జరిగింది. దాని వల్ల చాలామంది సంతోషపడ్డారు. వారి చేరికల వల్ల వారికి లాభం, పార్టీకి కూడా లాభమే.

హుజూరాబాద్ ఎన్నిక ఫలితాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన పని లేదు. మునుగోడుని కూడా అంత పెద్ద ఎన్నికగా చూడాల్సిన అవసరం లేదు. మునుగోడు ఉపఎన్నికలో కచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తాం. అందులో ఏ అనుమానం లేదు.

హుజూరాబాద్ ని కూడా గెలవాల్సింది. లాస్ట్ మినిట్ లో ఏదో తేడా జరిగింది. చేరికలను భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఈ చేరికల వల్ల మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు లాభం జరుగుతుందని కాదు. పార్టీ అందరిని కలుపుకుని పోతుంది. అన్ని కులాలు, మతాలు, వర్గాలను గౌరవిస్తుందని అనే సందేశం మాత్రం బలంగా ప్రజల్లోకి వెళ్లింది. వీటన్నింటికి మించి ప్రత్యర్థి కూడా నైతికంగా బలహీనపడ్డాడు. ఆ విధంగా చూస్తే చేరికల వల్ల పార్టీకే లాభమే తప్ప నష్టం లేదు” అని కేటీఆర్ అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ ని వీడి బీజేపీలో చేరిన తర్వాత అందుకు ప్రతిచర్యగా టీఆర్ఎస్ పార్టీ మరింత అగ్రెసివ్‌గా వ్యవహరిస్తోందనే టాక్ వినిపిస్తోంది. బీజేపిలో ఉన్న అసంతృప్త బీసీ నేతలపై కన్నేసిన టీఆర్ఎస్.. వారిని తమ పార్టీలోకి తీసుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే బూడిద భిక్షమయ్య గౌడ్, స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ లాంటి కొందరు బీసీ నేతలను తిరిగి టీఆర్ఎస్ లోకి రప్పించిందనే టాక్ కూడా వినిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక ముగిసేలోపు ఇంకెంత మంది పార్టీ మారనున్నారో చూడాలి.