Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు చేశాను: బాధితురాలు

దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని ఢిల్లీ వేదికగా కొన్ని రోజులుగా బాధితురాలు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు చేశాను: బాధితురాలు

MLA Durgam Chinnaiah

Updated On : June 12, 2023 / 4:46 PM IST

Durgam Chinnaiah – BRS: తెలంగాణ(Telangana)లోని బెల్లంపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించారని ఆరోపణలు చేస్తోన్న యువతి కేంద్ర దర్యాప్తు బృందం (CBI)కి ఫిర్యాదు చేశారు. దుర్గం చిన్నయ్య అవినీతి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె చెప్పారు.

దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని ఢిల్లీ వేదికగా కొన్ని రోజులుగా బాధితురాలు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. పోలీసులకు ఆయన డబ్బులు ఇచ్చి వారిని మేనేజ్ చేస్తున్నారని ఆ యువతి ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలను సీబీఐకి ఇచ్చానని ఇవాళ మీడియాకు తెలిపారు.

తెలంగాణ పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేకే తాను సీబీఐని ఆశ్రయించానని చెప్పారు. పారదర్శకంగా దర్యాప్తు చేయాలని సీబీఐని కోరామని అన్నారు. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని, మరింత వేధిస్తున్నారని చెప్పారు.

తన వద్ద ఉన్న ఆడియో, ఇతర ఆధారాలను అధికారులకు అందజేశానని తెలిపారు. సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తామని అన్నారని చెప్పారు. దుర్గం చిన్నయ్యపై కేసు నమోదై, విచారణ జరిపేంతవరకు తాము ఢిల్లీలోనే ఉండి పోరాడతామని అన్నారు. తనకు ప్రాణ హాని ఉందని ఆమె ఇప్పటికే పలుసార్లు చెప్పారు.

Karumuri Nageswara Rao: వచ్చే ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసినా సరే…: అమిత్ షా వ్యాఖ్యలపై ఏపీ మంత్రి