Ys Sharmila : ప్రశ్నించడానికే వచ్చా.. రాజకీయాల్లో ఇదే నా తొలి అడుగు : షర్మిల

రాజకీయ పార్టీ పెట్టబోతున్నానని అన్నారు. రాజన్న బాటలో రాజకీయాల్లోకి తొలి అడుగు వేస్తున్నానని తెలిపారు. రాజన్న సంక్షేమ పాలన తిరిగి తేవాలని సంక్పలిస్తున్నానని స్పష్టం చేశారు.

Ys Sharmila : ప్రశ్నించడానికే వచ్చా.. రాజకీయాల్లో ఇదే నా తొలి అడుగు : షర్మిల

Ys Sharmila Announces Party (1)

Ys Sharmila Sankalpam Sabha : రాజన్న బాటలో రాజకీయాల్లోకి తొలి అడుగు వేస్తున్నానని వైఎస్ షర్మిల అన్నారు. ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ లో షర్మిల సంకల్ప సభను నిర్వహించారు. రాజన్న సంక్షేమ పాలన తిరిగి తేవాలని సంక్పలిస్తున్నానని చెప్పారు. రాజకీయాల్లోకి నా తొలి అడుగు వేస్తాన్నానంటూ షర్మిల పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీ పెట్టబోతున్నానని అన్నారు. రాజన్నపాలన తిరిగి తేవాలని సంకల్పిస్తున్నానని స్పష్టం చేశారు.ప్రశ్నించడానికి, నిలదీయడానికి మన పార్టీ అవసరమన్నారు. వైఎస్సార్ చేపట్టిన ప్రాజెక్టును సీఎం కేసీఆర్ రీడిజైన్ చేశారని తెలిపారు.

కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టారని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ ప్రాజెక్టును తలా తోక లేకుండా చేశారని విమర్శించారు. రుణమాఫీ చేస్తామని ఇప్పటికీ చేయలేదన్నారు. పేద విద్యార్థులు గొప్ప చదవులు చదవుకుంటే పేదరికం పోతుంది.. ఫీజు రీయింబర్స్ మెంట్ ఇప్పుడు 30శాతం కూడా రావడం లేదని విమర్శించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం లేదన్నారు. వైఎస్ఆర్ ఐదేళ్ల పాలనలో పేదలకు 46 లక్షలు ఇళ్లు కట్టించారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నమాట ఏమైందని ప్రశ్నించారు.

వైఎస్సార్ పాలనకు కేసీఆర్ పాలనకు పోలికే లేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నానని వైఎస్ షర్మిల చెప్పారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు ఆగలేదన్నారు. తెలంగాణలో 6వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఉద్యమంలో వందలమంది అమరలయ్యారని అన్నారు. తెలంగాణ సాధించాక కూడా ఆత్మహత్యలకు కారణం ఎవరు? అని ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ఆర్ ను తిరిగి ప్రతిష్టించబోతున్నానని షర్మిల స్పష్టం చేశారు.

కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది సీఎం సారూ అంటూ షర్మిల ప్రశ్నించారు. ఉద్యోగాలు ఏమయ్యాయి? నిరుద్యోగ భృతి హామీ ఏమైందన్నారు. ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుంటేనే ఉద్యోగం వస్తుందని జనం అనుకుంటున్నారని, ఏ అధికారి ఎక్కడ పనిచేస్తున్నారో తెలియదన్నారు. సచివాలయంలో అడుగుపెట్టని ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా? అని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ అడుగుపెట్టని సచివాలయం ఎందుకని కూల్చేశారా? సూటిగా ప్రశ్నించారు. షర్మిల సభకు తల్లి వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. షర్మిలకు మద్దతివ్వాలని వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు.