YS Sharmila: అందుకే పేపర్లు లీక్ చేసి అమ్ముకుంటున్నారా?: వైఎస్ షర్మిల

YS Sharmila: తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే, పక్క రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ వ్యక్తికి 18 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం ఎలా ఇస్తారని కేసీఆర్‌ను షర్మిల ప్రశ్నించారు. ఏపీలోనూ బీఆర్ఎస్ పార్టీని విస్తరిస్తున్న విషయం తెలిసిందే.

YS Sharmila: అందుకే పేపర్లు లీక్ చేసి అమ్ముకుంటున్నారా?: వైఎస్ షర్మిల

YS Sharmila

YS Sharmila: సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర సొమ్ము మీ తాత జాగీరా అంటూ నిలదీశారు. ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్‌కు ఉద్యోగాలు ఇవ్వడం చేతకావడం లేదని అన్నారు.

తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే పక్క రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ వ్యక్తికి 18 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం ఎలా ఇస్తారని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్ర సంపద మీ అత్తగారి సొమ్మా? అని అన్నారు. “రాష్ట్ర ఉద్యోగాలు మీ ఇంట్లో నౌకరు పదవులా మీ ఇష్టారాజ్యంగా రాసివ్వడానికి?” అని ప్రశ్నించారు. అందుకే పేపర్లు లీక్ చేసి అమ్ముకుంటున్నారా అని నిలదీశారు.

జీవోలను దాచిపెట్టి ఉద్యోగాలు కట్టబెడుతున్నది అందుకేనా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఖజానాలో ఉన్న రూ.1,250 కోట్లు సరిపోవడం లేదా అని నిలదీశారు. అవి సరిపోవన్నట్లు సర్కారు ఉద్యోగాలనూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ర్యకర్తలకు పదవుల కోసం ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడానికి కేసీఆర్ ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ విషయాన్ని షర్మిల ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.

Minister Adimulapu Suresh : చంద్రబాబు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు : మంత్రి ఆదిమూలపు