YS Sharmila : ఆరోగ్య తెలంగాణ అంటే.. ఒక్కో బెడ్డుపై ఇద్దరు, ముగ్గురు పేషెంట్లను పడేయడమా? : వైఎస్ షర్మిల

ఆరోగ్య తెలంగాణ అంటే.. జేహెచ్ఎస్, ఈహెచ్ఎస్ స్కీములను పాతరేయడమా? 104 పథకాన్ని మూసేయడమా? పేదోడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీకి నిధులు ఎగ్గొట్టడమా అంటూ నిలదీశారు.

YS Sharmila : ఆరోగ్య తెలంగాణ అంటే.. ఒక్కో బెడ్డుపై ఇద్దరు, ముగ్గురు పేషెంట్లను పడేయడమా? : వైఎస్ షర్మిల

YS Sharmila (1)

YS Sharmila : తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. ఆరోగ్య తెలంగాణ చేశామంటున్న దొర కంటికి, పంటికి హస్తినకు ఎందుకు పోతున్నట్లని ప్రశ్నించారు. ఆరోగ్య తెలంగాణ అంటే ఒక్కో బెడ్డు మీద ఇద్దరు, ముగ్గురు పేషెంట్లను పడేయడమా? అని ఎద్దేవా చేశారు. లక్ష మందికి ఒక డాక్టరు, 10వేల మందికి ఒక నర్సు ఉండటమా? కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతో బాలింతలను పొట్టన పెట్టుకోవడమా? అని ప్రశ్నించారు.

ఆరోగ్య తెలంగాణ అంటే.. జేహెచ్ఎస్, ఈహెచ్ఎస్ స్కీములను పాతరేయడమా? 104 పథకాన్ని మూసేయడమా? పేదోడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీకి నిధులు ఎగ్గొట్టడమా అంటూ నిలదీశారు. వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఅర్ పై విమర్శలు చేశారు. కేసీఆర్ హామీ ఇచ్చిన జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి లేదని, రాజధాని హైదరాబాదాద్ లో నలుదిక్కులా హెల్త్ హబ్బులు లేవని విమర్శించారు. ఉస్మానియా హెల్త్ టవర్ లేదన్నారు.

YS Sharmila : బీఆర్ఎస్-బీజేపీ దొందు దొందే.. కేసీఆర్ 420, మోసగాడు : వైఎస్ షర్మిల

ఎలుకలు కొరికి రోగులు చనిపోతున్నా పట్టించుకునే దిక్కు లేదని ఎద్దేవా చేశారు. పరికరాలు, యంత్రాలు పనిచేయకపోయినా దిక్కూమొక్కూ లేదన్నారు. మారుమూల గ్రామాలకు అంబులెన్సులు లేవని విమర్శించారు. దవాఖాన్లలో సిబ్బంది లేరని, ఆస్పత్రి భవనాలు పాతబడి, పెచ్చులూడుతున్నా సోయి లేదన్నారు. ఆరోగ్య తెలంగాణ పేరుతో అనారోగ్య తెలంగాణగా మార్చారని ఎద్దేవా చేశారు. జబ్బు చేస్తే అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకునేలా చేస్తున్నారని పేర్కొన్నారు.