Dairy Farming : గేదెల డెయిరీతో ఆదర్శంగా నిలుస్తున్న పశ్చిమగోదావరి జిల్లా రైతు

అనుభవం అభివృద్ధికి పునాది. దీనికి  నిదర్శనమే రైతు కర్రీ పుత్రారెడ్డి.  తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలానికి చెందిన ఈయన పద్నాఏళ్ల క్రితం వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణ చేపట్టారు. వ్యవసాయం కంటే ఆర్థికంగా పశుపోషణ లాభంగా ఉండటం గమనించి, క్రమేపి డెయిరీని విస్తరించారు.

Dairy Farming : గేదెల డెయిరీతో ఆదర్శంగా నిలుస్తున్న పశ్చిమగోదావరి జిల్లా రైతు

Dairy farming

Dairy Farming : వ్యవసాయానికి అనుబంధంగా, రైతుకు శాశ్వత ఉపాధిని కల్పిస్తున్న రంగం పాడిపరిశ్రమ. పెట్టిన పెట్టుబడి… పెంచే పశుజాతి.. పాటించే నిర్వాహనబట్టే.. ఈ రంగంలో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. పాడి పరిశ్రమలో నష్టం వచ్చిందంటే అది కచ్చితంగా మన స్వయంకృతాపరాధమే. పశుపోషణను ఉపాధిగా మలుచుకుని, కంటికి రెప్పలా ఈ పరిశ్రమను వెన్నంటి వున్న వారికి లాభాలకు కొదవ ఉండదని నిరూపిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. 14 ఏళ్లుగా గేదెల డెయిరీ నిర్వాహణతో సత్ఫలితాలను సాధిస్తున్నారు.

READ ALSO : Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు

అనుభవం అభివృద్ధికి పునాది. దీనికి  నిదర్శనమే రైతు కర్రీ పుత్రారెడ్డి.  తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలానికి చెందిన ఈయన పద్నాఏళ్ల క్రితం వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణ చేపట్టారు. వ్యవసాయం కంటే ఆర్థికంగా పశుపోషణ లాభంగా ఉండటం గమనించి, క్రమేపి డెయిరీని విస్తరించారు. 6 గేదెలు 2 ఆవులతో ప్రారంభించిన ఈయన ఫామ్.. నేడు 500 గేదెలు 60 ఆవులకు చేరుకుంది.

READ ALSO : Summer Ploughing : వేసవి దుక్కులతో తెగుళ్లకు చెక్

వీటితోపాటు మరో 300 పైనే దూడలు, పడ్డలు వుంటాయి. 2 ఎకరాల్లో డెయిరీకి షెడ్ లను ఏర్పాటు చేశారు.   స్వంత భూమిలో ఈ డెయిరీని ప్రారంభించి దినదినాభివృద్ధి చెందారు. ప్రతిరోజు 3,500 లీటర్ల పాలదిగుబడిని పొందుతున్నారు. వచ్చిన పాలను రామసీత బ్రాండ్ పై దాదాపు రోజుకు రెండు నుండి 2 వేల 500 లీటర్ల పాలు అమ్ముతూ.. మిగితా వాటిని ఉపఉత్పత్తులుగా తయారుచేసి విక్రయిస్తున్నారు.

READ ALSO : Nutritional Elements in Fodder : అధిక పోషక విలువలు కలిగిన పశుగ్రాసాలు

ప్రస్తుతం ఇక్కడ ఉన్న గేదెలు, ఆవులన్నీ చాలా వరకు ఫామ్ లో అభివృద్ధి చెందినవే. 6 , 7 ఈతల తరువాత వాటిని తీసివేసి , ఎదిగిన దూడలను చూడికట్టించి మందలో కలుపుతారు. సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో పశుపోషణలో ముందడుగు వేసే పుత్రారెడ్డి.. 80 ఎకరాల్లో పచ్చిమేత కోసం సూపర్ నేపియర్ గడ్డి పెంపకాన్ని చేపట్టారు.  అంతే కాదు పచ్చిగడ్డితో పాటు మినరల్ మిక్షర్ ను కూడా అందిస్తూ.. లాభాల భాటలో పయనిస్తున్నారు.