Rice Seed Production : వరి విత్తనోత్పత్తితో లాభాలు ఆర్జిస్తున్న రైతు

ఖర్చులు పెరిగిపోయి, సాగు పట్ల నిరాశ వ్యక్తంచేస్తున్న తరుణంలో గత పదేళ్లుగా అందుబాటులోకి వచ్చిన అనేక కొత్త వంగడాలు రైతులకు నూతన జవసత్వాలను కల్పిస్తున్నాయి.

Rice Seed Production : వరి విత్తనోత్పత్తితో లాభాలు ఆర్జిస్తున్న రైతు

rice seed production

Updated On : September 25, 2023 / 11:30 AM IST

Rice Seed Production : వరి సాగులో ఎకరాకు 40 బస్తాల దిగుబడి రావటం అంటే ఒకప్పుడు గొప్ప విషయం. కానీ ఇప్పుడు కాలం అనుకూలించాలేగాని  50 నుండి 60 బస్తాల దిగుబడిని సునాయాసంగా  సాధించే పరిస్థితులు వచ్చాయి. గత దశాబ్ధకాలంగా  పరిశోధనల్లోని ప్రగతి, నూతన వరి వంగడాల రూపకల్పనకు శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి వల్ల, సాగు ఆశాజనకంగా  కనిపిస్తోంది. అయితే పెరిగిన పెట్టుబడులతో.. వరి సాగులో ఆదాయం తగ్గుతూ వస్తోంది. ఈ నేపధ్యంలోనే కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ రైతు ప్రతి ఏటా నూతన వరి రకాలను సేకరించి విత్తనోత్పత్తి చేస్తూ.. అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు.

READ ALSO : Seasoned Salt : వంటకాలలో రుచికోసం ఉపయోగించే ఉప్పు తో ఆరోగ్యానికి ముప్పు !

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పంట అయిన వరిలో కొత్త కొత్త వంగడాలు.. కొంగొత్త సాగు పద్ధతులతో, రైతుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. ఖర్చులు పెరిగిపోయి, సాగు పట్ల నిరాశ వ్యక్తంచేస్తున్న తరుణంలో గత పదేళ్లుగా అందుబాటులోకి వచ్చిన అనేక కొత్త వంగడాలు రైతులకు నూతన జవసత్వాలను కల్పిస్తున్నాయి.

READ ALSO : Pests In Sesame : నువ్వు పంటసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు!

అయితే రైతులు వీటి సాగుద్వారా అధిక దిగుబడిని తీస్తున్నారు కానీ.. అధిక ఆదాయం పొందలేకపోతున్నారు. కానీ కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ మండలం, సిర్సపల్లి గ్రామానికి చెందిన రైతు వంగల వెంకట్ రెడ్డి మాత్రం 20 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోని పరిశోధనా కేంద్రాల్లో మినికిట్ దశలో ఉన్న వరి వంగడాలను సేకరించి విత్తనోత్పత్తి చేస్తున్నారు. పండిన ధాన్యాన్ని మిల్లర్లకు అమ్మకుండా.. నేరుగా రైతులకు విత్తనం అమ్మి.. అధిక లాభాలను పొందుతున్నారు.