Coconut Farming : నల్లితో నాణ్యత కోల్పోతున్న కొబ్బరి కాయలు

గత నాలుగైదు ఏళ్ళుగా కొబ్బరి చెట్లకు నల్లి తెగుళ్ళతో పాటు ఇతర చీడపీడలు ఆశించడం కొబ్బరి పరిశ్రమ మీద ఆధారపడ్డ రైతులు , వ్యాపారులు కూడా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుండి ఇతర రాష్ట్రాలకు ప్రతిరోజు పెద్ద ఎత్తున కొబ్బరి ఎగుమతి అయ్యేది.

Coconut Farming : నల్లితో నాణ్యత కోల్పోతున్న కొబ్బరి కాయలు

Coconut Farming

Updated On : September 10, 2023 / 12:10 PM IST

Coconut Farming : కొబ్బరిని ఎక్కువగా పండించే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఇక్కడ సుమారు లక్షా నాలుగు వేల హెక్టార్లలో సాగవుతుంది. విస్తీర్ణంలో కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల తరువాత 4వ స్థానంలో ఉంది. ఉత్పదకతలో మొదటి స్థానంలో ఉన్నది. సగానికి పైగా విస్తీర్ణం ఉభయగోదావరి జిల్లాలలోనే సాగవుతుంది. మిగిలిన విస్తీర్ణం ఉత్తరకోస్తా, కృష్ణ, గుంటూరు, చిత్తూరు జిల్లాల సముద్రతీర ప్రాంతాలకే పరిమితంగా ఉన్న కొబ్బరి పంట.. ఇటీవల కాలంలో నీటి వసతి గత ఇతర జిల్లాలలోని మోట్ట ప్రాంతాల్లో కూడా విస్తరిస్తుంది. ఉత్పదకతలో  ముందు ఉన్నా ఇటీవల చీడపీడల ఉధృతితో దిగుబడి నాణ్యత కోల్పోయి నష్టాలను చవిచూస్తున్నారు రైతులు.

READ ALSO : Managed Cow Dairy : ప్రతి రోజు 550 లీటర్ల పాలదిగుబడితీస్తూ.. అధిక లాభాలు పొందుతున్న యువరైతు

ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ శాతం మంది రైతులు కొబ్బరి సాగుపై ఆధారపడి ఉన్నారు. ఇంటి పెరట్లో ఒక కొబ్బరి చెట్టు ఉందంటే దానిని ఆ ఇంట్లో పెద్ద కొడుకు మాదిరిగా భావిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. రెండు నెలలకు ఒకసారి అయినా ఆ కొబ్బరి చెట్ల నుండి దిగుబడి వస్తుందని ఇంట్లో ఖర్చులు కొంతవరకు గట్టెక్కుతాయని చెబుతారు.

READ ALSO : Integrated Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న.. చార్టర్డ్ అకౌంటెంట్

అయితే గత నాలుగైదు ఏళ్ళుగా కొబ్బరి చెట్లకు నల్లి తెగుళ్ళతో పాటు ఇతర చీడపీడలు ఆశించడం కొబ్బరి పరిశ్రమ మీద ఆధారపడ్డ రైతులు , వ్యాపారులు కూడా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుండి ఇతర రాష్ట్రాలకు ప్రతిరోజు పెద్ద ఎత్తున కొబ్బరి ఎగుమతి అయ్యేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదని కొబ్బరి వ్యాపారులు వాపోతున్నారు.

READ ALSO : Mixed Flour : కలిపిన చపాతీ, పూరీ పిండిని మర్నాడు వాడితే ఎంత ప్రమాదమో తెలుసా?

ఇటీవల కాలంలో కొబ్బరితోటల్లో చీడపీడల ఉధృతి పెరిగిపోయింది. ముఖ్యంగా గానోడెర్మా,  నల్లమచ్చతెగులు, మెవ్వుకుళ్లు, తెల్లదోమ, ఇరియోఫిడ్ నల్లి కొబ్బరిని ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే తోటలను కాపాడుకొని అధిక దిగుబడిని పొందవచ్చని తెలియజేస్తున్నారు  పశ్చిమగోదావరి జిల్లా ఉద్యాన అధికరిని ప్రియదర్శిని.