Cotton Cultivation : పత్తిలో రసంపీల్చు, గులాబిరంగు పురుగుల ఉధృతి.. నివారణకు చేపట్టాల్సిన యాజమాన్యం

Cotton Cultivation : ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసాయి. అయితే సాధారణ సాగుకు మించి సాగైంది. వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం  60 నుండి 120 రోజుల దశలో పత్తి ఉంది. ముందుగా విత్తుకున్న రైతుల పొలాల్లో కాయలు కూడా ఉన్నాయి.

Cotton Cultivation : పత్తిలో రసంపీల్చు, గులాబిరంగు పురుగుల ఉధృతి.. నివారణకు చేపట్టాల్సిన యాజమాన్యం

Control of in Telugu States

Updated On : September 20, 2024 / 3:40 PM IST

Cotton Cultivation : ఈ ఖరీఫ్ లో వేసిన పత్తి పైరు వివిధ ప్రాంతోల్లో వివిధ దశల్లో వుంది. తొలకరిలో సకాలంలో విత్తిన పైరు ప్రస్తుతం మొదటి కాయ దశలో ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో పూత, గూడ దశల్లో కనిపిస్తోంది. ఈదశలోని పత్తిపైరులో రసంపీల్చు పురుగులు, గులాబిరంగు పురుగుల తాకిడి పెరిగింది. దీంతో మొక్కలు ఎదుగుదల లోపిస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు, కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్.

ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసాయి. అయితే సాధారణ సాగుకు మించి సాగైంది. వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం  60 నుండి 120 రోజుల దశలో పత్తి ఉంది. ముందుగా విత్తుకున్న రైతుల పొలాల్లో కాయలు కూడా ఉన్నాయి. ఈ దశలో రసంపీల్చు పురుగులు, గులాబిరంగు పురుగుల ఉధృతి  పెరిగింది. దీంతో పంటకు అధిక నష్టం జరుగుతుంది.

ఇవి మొక్కల నుంచి రసం పీల్చటం వల్ల  పెరుగుదల తగ్గిపోయి, దిగుబడులపై ప్రభావం తీవ్రంగా వుంటుంది. ఈ పురుగులు నష్టపరిచే విధానం, వీటి నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు , జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్.

Read Also : Rice-Cotton Crop : వరి, పత్తిలో పురుగుల నివారణ