Paddy Cultivation : అతి పురాతన దేశీ వరి రకాల సాగుతో అధిక లాభాలు.. మార్కెట్లో మంచి డిమాండ్..!
Paddy Cultivation : అంతరించిపోతున్న దేశీవరి రకాలలో అధిక ఔషద గుణాలు ఉండటంతో మార్కెట్ లో కూడా మంచి ధర పలుకుతుంది.

Paddy Cultivation
Paddy Cultivation : ప్రజల్లో పెరుగుతున్న ఆరోగ్య సృహ కారణంగా, మార్కెట్‌లో ఔషద విలువలున్న పంటలకు డిమాండ్ పెరుగుతుంది. దీన్నే అవకాశంగా తీసుకున్న చాలా మంది రైతులు, అధిక పోషక విలువలు కలిగి ఉండి, అంతరించిపోతున్న దేశీ వరి వంగడాలను పండిస్తూ.. అధిక లాభాలు పొందుతున్నారు.
ఈ కోవలోనే నంద్యాల జిల్లాకు చెందిన ఓ రైతు అతి పురాతనమైన దేశీ వరి రకాలను సాగుచేస్తున్నారు. వీటికి ఎలాంటి రసాయన మందులను వేయకుండా కేవలం ప్రకృతి విధానంలోసాగుచేస్తున్నారు. అంతే కాదు సేంద్రియ ఎరువులు, కషాయాలను తయారుచేస్తూ.. తక్కువ ధరకే రైతులకు అందస్తున్నారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. అందులో పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్నే ప్రజలు ఇష్టపడుతున్నారు. దీంతో రైతులు కూడా అధిక పోషకాలు ఉన్న పంటల సాగుకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగానే చాలా మంది రైతులు సేంద్రియ విధానంలో పంటలను పండిస్తున్నారు. ముఖ్యంగా అంతరించిపోతున్న దేశీవరి రకాలలో అధిక ఔషద గుణాలు ఉండటంతో మార్కెట్ లో కూడా మంచి ధర పలుకుతుంది.
దీంతో రైతులు దేశీ వరి రకాలను సేకరించి సాగుచేస్తూ.. మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలా సాగుచేస్తున్న వారిలో నంద్యాల జిల్లా, గోస్పాడు మండలం, జిల్లెల గ్రామానికి చెందిన రైతు బాల మద్దిలేటి ఒకరు. తన 10 ఎకరాల్లో అంతరించి పోతున్నఅతి పురాణ వరి రకాలను సాగుచేస్తున్నారు. ఎలాంటి రసాయన మందులను వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులనే వాడుతూ పంట పండిస్తున్నారు.
Read Also : Cow Dung : ఆవు పేడతో బిజినెస్ చేస్తున్న మహిళ.. 10 మందికి ఉపాధినిస్తూ.. అమెరికాకి కూడా..
రైతును ఆరోగ్యంగా ఉండం.. భూమిని ఆరోగ్యంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు రైతు మద్దిలేటి. తనోక్కడే కాకుండా.. తోటి రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం చేయించే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం దేశీ వరి రకాల సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు నవధాన్యాల కిట్లు, పెరటితోటల కిట్లు, బీజమృతం, ఘణ, ద్రవజీవామృతంతో పాటు జీవన ఎరువులు, కషాయాలు తయారు చేసి తక్కువ ధరకే అందిస్తున్నారు.