Cotton Cultivation : పత్తికి తొలిదశలో ఆశించే చీడపీడల నివారణ
ఈ పంట సాగులో అనేక సమస్యలు వున్నా.... వర్షాధారంగా సాగయ్యే ఇతర పంటలకంటే మంచి ఫలితాలు ఇస్తుండటం వల్ల ఏటా దీని సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుతం పంట విత్తేందుకు సిద్ధమవుతున్న రైతులు.. తొలిదశలో వచ్చే చీడపీడల పట్ల జాగ్రత్త వహించాలంటున్నారు శాస్త్రవేత్తలు.

Cotton Cultivation
Cotton Cultivation : ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యింది . విత్తనాలు విత్తేందుకు.. రైతులు భారీ వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా పండే ప్రధాన పంటల్లో పత్తిదే సింహభాగం. ఖరీఫ్ పత్తి సాగుకు సిద్దమవుతున్న రైతులు తొలిదశలో ఆశించే చీడపీడల నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్త నాగరాజు.
READ ALSO : Cabbage Cultivation : క్యాబేజి సాగులో మేలైన యాజమాన్యం.. మార్కెట్ కు అనుగుణంగా సాగుచేస్తే మంచి లాభాలు
తెలుగురాష్ట్రాల్లో వర్షాధారంగా అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట పత్తి. తెలంగాణాలో పత్తి సాధారణ విస్తీర్ణం 40 లక్షల ఎకరాలకు కాగా 50 లక్షల ఎకరాలకు పైగా సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఏటా 12 నుండి 15 లక్షల ఎకరాల్లో సాగులో వుంది.
READ ALSO : Cotton Seeds : ఒకే రకం పత్తి విత్తనాల సాగుకు రైతుల మొగ్గు..
ఈ పంట సాగులో అనేక సమస్యలు వున్నా…. వర్షాధారంగా సాగయ్యే ఇతర పంటలకంటే మంచి ఫలితాలు ఇస్తుండటం వల్ల ఏటా దీని సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుతం పంట విత్తేందుకు సిద్ధమవుతున్న రైతులు.. తొలిదశలో వచ్చే చీడపీడల పట్ల జాగ్రత్త వహించాలంటున్నారు శాస్త్రవేత్తలు.
READ ALSO : Cotton Cultivation : పత్తిసాగుకు సన్నద్దమవుతున్న రైతులు.. సాగులో మేలైన యాజమాన్యం
ముఖ్యంగా పత్తి పంటకు తొలిదశలో ఆశించి చీడపీడలు.. వాటి నివారణ చర్యలను రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్త నాగరాజు.