Controlling Fruit Flies : ఆగాకరలో పండుఈగ ఉధృతి.. సమగ్ర సస్యరక్షణ చర్యలతోనే నివారణ

పాదుజాతి కూరగాయల్లో ప్రతీ పంటకు పండుఈగ సమస్య వుంది. రసాయన పురుగు మందులు వాడటం వల్ల ఖర్చులు పెరగటం తప్ప, నివారణ అనేది పూర్తిస్థాయిలో సాధ్యం కాదు. కాబట్టి వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే, ఈ ఈగను అరికట్టి, అధిక దిగుబడులను సాధించడానికి ఆస్కారం ఉంటుంది.

Controlling Fruit Flies : ఆగాకరలో పండుఈగ ఉధృతి.. సమగ్ర సస్యరక్షణ చర్యలతోనే నివారణ

Fruit Flies in Agakara

Updated On : July 8, 2023 / 9:42 AM IST

Controlling Fruit Flies : ఉద్యాన పంటలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో రైతులు సేద్యానికి ఆసక్తి చూపుతున్నారు. పెట్టుబడి వ్యయం తక్కువ కావటం, ఉత్పత్తులు అధికంగా వచ్చి, మంచి ఆదాయం వస్తుండటంతో రైతులు కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా వరంగల్ , ఖమ్మం జిల్లాలో సిటీకి దగ్గరగా ఉన్న గ్రామాల్లోని రైతులు  అనేక సంవత్సరాలుగా ఆగాకరను సాగుచేస్తున్నారు.

READ ALSO : Kharif Crops : ఈ ఏడాదైనా కలిసి వచ్చేనా..? ఖరీఫ్‌ పంటలపై ఆశలు పెట్టుకున్న అన్నదాతలు

ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా పండు ఈగ ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. దీనిని గుర్తించిన వెంటనే నివారించకపోతే పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. పండుఈగను అరికట్టేందుకు సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. ఎ . వెంకటరెడ్డి.

కూరగాయలకు మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. నగరాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో చాలామంది రైతులు కూరగాయలనే అధికంగా సాగుచేస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా వరంగల్, ఖమ్మం జిల్లాలో ఆగాకర సాగుకు రైతులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.  వర్షాకాలం నుండి శీతాకాలం వరకు కొనసాగే ఈ పంటకు ఏటా మంచి ధర లభిస్తోంది. అయితే ఇప్పుడు పండుఈగ బెడద ఆగాకరకు పెద్ద సమస్యగా మారింది.

READ ALSO : Rahul Gandhi: పొద్దుపొద్దున్నే పొలంలో కనిపించిన రాహుల్ గాంధీ

ఈ పురుగు బెడద వల్ల కాయలు నాణ్యత కోల్పోయి దిగుబడికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీనిని ఫ్రూట్ ప్లై అని అంటారు.  రైతులు ఇప్పటికే 3 నుండి 4 కోతలు  కోశారు . అయితే ఇప్పుడు కొత్తగా పూత నుండి కాయలు అవుతున్న సమయం వీటి ఉధృతి పెరగింది. ఈ పురుగులు ఆశించిన కాయలు పనికిరాకుండా పోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండుఈగ నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు  వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. ఎ . వెంకటరెడ్డి.

పాదుజాతి కూరగాయల్లో ప్రతీ పంటకు పండుఈగ సమస్య వుంది. రసాయన పురుగు మందులు వాడటం వల్ల ఖర్చులు పెరగటం తప్ప, నివారణ అనేది పూర్తిస్థాయిలో సాధ్యం కాదు. కాబట్టి వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే, ఈ ఈగను అరికట్టి, అధిక దిగుబడులను సాధించడానికి ఆస్కారం ఉంటుంది.

READ ALSO : Pest Control in Paddy : వానకాలం వరిసాగులో అధికంగా ఉల్లికోడు, సుడిదోమ, కాండం తొలుచు పురుగుల తాకిడి

పూత , పింద ఏర్పడే దశలో  పండుఈగ ఉధృతిని  గమనించినట్లైతే ,  తక్కువ విషపూరితమైన మలాథియాన్, కార్భరిల్ లాంటి మందులను పిచికారి చేయాలి. కాయలు ఉంటే కోసుకున్న తరువాతే పిచికారి చేసుకోవాలి. లేదంటే పురుగు మందులు పిచికారి చేసిన తరువాత  7 నుండి10 రోజుల వ్యవధిలో కాయలు కోయాలి.

అలాగే  పంట అయిపోయిన తరువాత పురుగు యొక్క ఫ్యూపా దశ భూమిలో ఉంటుంది కాబట్టి,  వేసవి దుక్కులు చేసుకోవడమే కాకుండా , పైరు మొదళ్ల దగ్గర ఉన్న మట్టిని పారతో ఎప్పటికప్పుడు కదిలించి, ప్యూపా దశను నాశనం చేయాలి. లేదా ఒక్కో పాదుకు ఫాలిడాల్ పొడిమందును 50 – 100 గ్రాముల డస్టింగ్ చేయటం వల్ల, భూమిలోపల నిద్రావస్థ దశలో వున్న ప్యూపాదశ పురుగులను నివారించుకోవచ్చు.