Ginger Cultivation : ఎత్తుమడుల విధానంలో అల్లం సాగు

అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కావు. తేమతో కూడిన వేడి వాతావరణం అల్లంసాగుకు అత్యంత అనుకూలం. పాక్షికంగా నీడ వున్న ప్రాంతంలో కూడా అల్లం పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది. 19 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో పంట పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది.

Ginger Cultivation : ఎత్తుమడుల విధానంలో అల్లం సాగు

Ginger Cultivation

Updated On : July 29, 2023 / 10:51 AM IST

Ginger Cultivation : అల్లం సాగులో సమస్యలను అధిగమించడానికి ఎత్తు మడుల పద్ధతిని అనుసరిస్తున్నారు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. ప్రయోగాత్మకంగా మారం అల్లం రకాన్ని సాగుచేస్తున్న శాస్త్రవేత్తలు దుంపుకుళ్లుని నివారించేదుకు ఈ విధానం ఎంతగానో తోడ్పడుతుందని చెబుతున్నారు. అంతే కాదు అంతర పంటలుగా స్వీట్ కార్న్, బంతిపూల సాగును చేపడుతున్నారు. ఈ విధానాన్ని గిరిజన రైతులతో వచ్చే ఏడాది నుండి సాగుచేయించనున్నట్లు చెబుతున్నారు.

READ ALSO : Cultivation of Citronella : సిట్రోనెల్లా గడ్డి సాగుతో సిరుల పంట.. ఒక్కసారి నాటితే 5 ఏళ్లు దిగుబడి

అల్లం సుగంధ ద్రవ్యపు పంట.. ఏజన్సీ ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ఈ పంట, అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం మూడునాలుగేళ్ల నుండే. సాగులో అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పంటసాగులో అధిక దిగుబడల సాధనకు మార్గం సుగమం అవటంతోపాటు, గత మూడేళ్లుగా మంచి మార్కెట్ ధర లభించటంతో , రైతులు సాగులో ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు.

READ ALSO : Cabbage and Cauliflower : క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలకు నల్లి బెడద.. నివారిస్తే మంచి దిగుబడులు

అయితే అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కావు. తేమతో కూడిన వేడి వాతావరణం అల్లంసాగుకు అత్యంత అనుకూలం. పాక్షికంగా నీడ వున్న ప్రాంతంలో కూడా అల్లం పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది. 19 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో పంట పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది. తెలంగాణాలో మెదక్ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోను, ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో అల్లం పంటను సాగుచేస్తున్నారు.

READ ALSO : International Tiger Day 2023: ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనన్ని పులులు భారత్‌లో ఉన్నాయి.. ఇక చైనాలో ఎన్నున్నాయో తెలుసా?

ప్రధానంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో చల్లని వాతావరణం ఉండటంతో ఇక్కడి రైతులు అనాదిగా అల్లం పంటను సాగుచేస్తూ ఉన్నారు. అయితే చీడపీడల కారణంగా అనుకున్న దిగుబడులను సాధించలేకపోతున్నారు. ఈ నేపధ్యంలోనే చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు మారన్ అల్లం రకాన్ని ఎత్తుమడుల విధానంలో ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్నారు. ఈ పంట సుమారు 9 నెలలు కావడంతో తక్కువ సమయంలో పంట చేతికొచ్చే పంటలను అంతర పంటలుగా సాగుచేస్తున్నారు.

READ ALSO : Skydiving Wedding: ఇది నిజంగా వెరైటీనే..! ఎత్తైన కొండపై నుండి స్కైడైవింగ్ చేస్తూ పెళ్లిచేసుకున్న నూతన జంట.. వీడియో వైరల్

ఈ విధానంలో సాగుచేయడం వల్ల మురుగునీటి సౌకర్యం పెరిగి, వేరు వ్యవస్థకు చీడ పీడలు ఆశించవు. అంతే కాదు బెట్ట, కరువు, ఎండకాలంలో తేమను నిలుపుకునే సౌకర్యం ఈ విధానంలో సాధ్యపడుతుంది. అంతే కాదు కలుపు యాజమాన్యం చేయుటకు సులువుగా ఉంటుంది. ఎత్తుముడుల విధానంలో నేల గుళ్లబారటం జరుగుతుంది. దీంతో మొత్తటి నేలల్లో వేరువ్యవస్థ బాగా వృద్ధిచెంది నీటిని, పోషకాలను పీల్చుకునే సామర్థ్యం పెరగటం వలన మొక్కలు బాగా పెరిగే అవకాశం ఉండటంతో, వచ్చే ఏడాది నుండి ఈ విధానంలో గిరిజన రైతులతో సాగుచేయించేదుకు సిద్దమవుతున్నారు.