Citronella Grass Cultivation : సిట్రోనెల్లా గడ్డి సాగుతో సిరుల పంట – ఒక్కసారి నాటితే 5 ఏళ్లు దిగుబడి అంటున్న శాస్త్రవేత్తలు  

Citronella Grass Cultivation : సిట్రోనెల్లా గడ్డి జాతికి చెందిన సుగంధ  మొక్క. దీనిని కామాక్షి కనువుగా పిలవబడే ఈ పంట శాస్త్రీయనామం సింబోపొగాస్‌ వింటేరియానస్‌. ఇది పోయేసి కుటుంబానికి చెందినది.

Citronella Grass Cultivation : సిట్రోనెల్లా గడ్డి సాగుతో సిరుల పంట – ఒక్కసారి నాటితే 5 ఏళ్లు దిగుబడి అంటున్న శాస్త్రవేత్తలు  

High profits with citronella Grass cultivation

Citronella Grass Cultivation : సుగంధనూనె ఇచ్చే పంటలు ఏడెనిమిది ఉన్నా, అందులో చెప్పుకొదగ్గవి, రైతులు వాణిజ్య పరంగా సాగుచేసేవి రెండున్నాయి. ఒకటి లెమన్ గ్రాస్ కాగా, మరొకటి సిట్రోనెల్లా. లెమన్ గ్రాస్ ని నిమ్మగడ్డి అని, సిట్రోనెల్లాను కామాక్షి గడ్డి అని అంటారు. ఇవి రెండూ.. గడ్డిజాతికి చెందిన బహువార్షిక మొక్కలు. ముఖ్యంగా కామాక్షి గడ్డి నుండి తీసిన నూనెను సబ్బులు, ఫర్ఫూమ్స్, అగర్బత్తి, సెంట్ లు, దోమల మందు తయారిలో వాడుతారు. ఆకులను టీ తయారిలో వాడుతుంటారు. చాలా సులువుగా సాగుచేసుకోదగ్గ పంటలు. సంప్రదాయ, వాణిజ్య పంటలతో విసిగి వేసారిన రైతులు ఈ పంటలను సాగుచేసుకోవచ్చు. ఒకసారి నాటుకుంటే ఐదేళ్ల పాటు దిగుబడిని తీసుకోవచ్చు. సిట్రోనెల్లా సాగు గురించి మరిన్ని వివరాలు తెలిజేస్తున్నారు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కృష్ణవేణి.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

సిట్రోనెల్లా గడ్డి జాతికి చెందిన సుగంధ  మొక్క. దీనిని కామాక్షి కనువుగా పిలవబడే ఈ పంట శాస్త్రీయనామం సింబోపొగాస్‌ వింటేరియానస్‌. ఇది పోయేసి కుటుంబానికి చెందినది. నిమ్మగడ్డిలాతే ఇది బహువార్షిక మొక్క.  దీని ఆకులలో సువాసన నూనె అధిక మోతాదులో ఉంటుంది. సబ్సులు, అగర్‌ బత్తి, డిటర్జెంట్లు, గృహ క్లీనర్‌లు, ఫర్ఫ్యూమ్ లాంటి పలు ఉత్పత్తులలో ఎక్కువగా వాడుతుంటారు. దీనిలో దోమలను, పురుగులను నియంత్రించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది ఇంటి ముందు కుండిల్లో పెంచుతుంటారు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ఈ గడ్డి నూనెలో 40 శాతం భారతదేశంలో ఉత్పత్తి అవుతుండగా , అందులో ఎక్కువ శాతం కేరళ రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం తెలంగాణ ఈ పంట సాగుకు అనుకూలంగా మారింది.

సిట్రోనెల్లాను సాగు చేసేందుకు తెలంగాణలో అన్ని నేలలు అనుకూలం. జులై, ఆగష్టు నెలల్లో ఈ పంటను సాగు చేసుకోవచ్చు. దుబ్బు నుంచి వచ్చిన ఆరోగ్యకరమైన పిలకలను నాటుకోవాలి. ఒక్కసారి నాటితే ఏడాది ఐదేళ్ల వరకు దిగుబడులు పొందవచ్చు. ఈ పంటలో చీడపీడల వ్యాప్తి తక్కువగా ఉంటుంది. వానాకాలంలో ఈ పంటను చేయాలనుకునే రైతులకు.. మేలైన సిట్రోనెల్లా గడ్డి రకాలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలోని సుగంధ పరిశోధన స్థానంలో అందుబాటులో ఉంచారు. అయితే సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే  కొద్ది పాటి మెళకువలు పాటించాలని తెలియ జేస్తున్నారు, ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త కృష్ణవేణి.

ఈ పంట సాగులో ఎరువులతో పాటు నీటి తడులు కూడా కీలక భూమిక పోషిస్తుంటాయి. తక్కువ సమయంలో అధిక నూనెతో కూడిన దిగుబడిని పొందాలంటే సమయానుకూలంగా ఎరువులు వాడాల్సి ఉంటుంది. అయితే  భూమి సారాన్ని బట్టే వేసుకోవాల్సి ఉంటుంది. భూసారం తక్కువ గల నేలల్లో సెంద్రీయ ఎరువులు వేయాల్సి ఉంటుంది. ఈ పంటను  పెద్దగా చీడపీడలు ఆశించవు .

సిట్రోనెల్లా సాగుచేసిన రైతులు, నూనెతీయడాకి తప్పకుండా డిస్టిలేషన్ ఉండాల్సి ఉంటుంది. ఒక టన్ను గడ్డి నుండి దాదాపు 8 నుండి 10 కిలోల నూనెను వస్తుంది. ఎకరాకు 100 కిలోల నూనె వస్తుంది. మార్కెట్ లో కిలో ధర రూ. 1000 నుండి 1500 వరకు పలుకుతుంది. సరాసరి 1200 వేసుకున్నా, 100 కిలోల నూనెకు రూ. 1 లక్షా 20 వేల ఆదాయం వస్తుంది. పెద్దగా పెట్టుబడిలేని పంట. అడవి జంతువులు, పక్షుల పంట నాశనం చేస్తాయన్న భయమూలేదు. కాబట్టి భూములను వృధాగా వదిలేసే వారు, సంప్రదాయ, వాణిజ్య పంటలతో నష్టపోయిన రైతులు ఈ పంటను సాగుచేస్తే నికర ఆదాయం ఎక్కడా పొదంటున్నారు శాస్త్రవేత్తలు.

Read Also : Cabbage Crop : క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలకు నల్లి బెడద – నివారిస్తే మంచి దిగుబడులు!