Gongura Cultivation : గోంగూర సాగుతో లాభాలు ఆర్జిస్తున్న రైతు

అతితక్కువ సమయం.. అతి తక్కు ఖర్చుతో సాగయ్యే ఈ పంటకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. రైతు ఎంత పండించినా అంతా అమ్ముడుపోతుంది.

Gongura Cultivation : గోంగూర సాగుతో లాభాలు ఆర్జిస్తున్న రైతు

Huge Profit In Gongura Cultivation

Updated On : October 23, 2024 / 3:15 PM IST

Gongura Cultivation : మారిన పరిస్థితుల్లో వ్యవసాయం రైతుకు గుదిబండగా మారింది. సాగులో నష్టాలు, కష్టాలు సర్వసాధారణంగా మారాయి. అన్నదాతలు ఎప్పుడైతే సంప్రదాయ సాగును విస్మరించి పురుగుముందులు, రసాయన ఎరువుల వెంటపడ్డారో అప్పుడే వారికి ఇబ్బందులు మొదలయ్యాయి.

పెట్టుబడి కొండంత… దిగుబడి, రాబడి మాత్రం గోరంతగా మారింది. దీంతో చాలా మంది అతి తక్కువ సమయంలో.. తక్కువ ఖర్చుతో చేతికొచ్చే ఉద్యాన పంటల సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు కొన్నేళ్లుగా గోంగూర సాగుచేస్తూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

వాణిజ్య పంటలు సాగులో పెట్టుబడి ఎక్కువ.. లాభాలు తక్కువ.. ఇది గ్రహించిన పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు మండలం, బల్లిపాడు గ్రామానికి చెందిన రైతు కుంచె శ్రీనివాస రావు.. ఆకు కూరల సాగువైపు దృష్టి సారించారు. తమకున్న కొద్దిపాటి భూమిలో కోన్నేళ్లుగా గోంగూర సాగు చేస్తున్నారు.

అతితక్కువ సమయం.. అతి తక్కు ఖర్చుతో సాగయ్యే ఈ పంటకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. రైతు ఎంత పండించినా అంతా అమ్ముడుపోతుంది. ఈ పంట సాగుకు కూలీల అవసరం కూడా లేదు . నాటిన 25 రోజుల నుండి నెల రోజుల వరకు పంట దిగుబడి వస్తూనే ఉంటుంది. వచ్చిన దిగుబడిని వ్యాపారులు తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తుండటంతో.. ఇతర పంటలతో పోల్చితే గోంగూరు సాగు మంచి లాభదాయకంగా ఉందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Groundnut Cultivation : వేరుశనగ విత్తుకునే చివరి సమయం.. అధిక దిగుబడులకోసం సాగులో మెళకువలు