Prawn Feeding : వ్యాధినిరోధక శక్తి పెరిగి.. పెట్టుబడులు తగ్గించే రొయ్యల దాణా

వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లోనూ రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. అందులో రొయ్యల పెంపకం ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో వనామి రొయ్యల సాగు విస్తృతంగా సాగవుతోంది. అయితే, వాతావరణ మార్పులు , పలు రకాల వ్యాధులు వస్తున్నాయి.

Prawn Feeding : వ్యాధినిరోధక శక్తి పెరిగి.. పెట్టుబడులు తగ్గించే రొయ్యల దాణా

Prawn Feeding

Prawn Feeding : దినదినాభివృద్ధి చెందుతున్న ఆక్వారంగంలో, సమస్యలు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రొయ్యల కల్చర్ లో వివిధ బాక్టీరియా వైరస్ వ్యాధుల దాడి కల్చర్ ను అతలాకుతలం చేస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా ఈ సమస్యల తీవ్రత మరింత పెరుగుతోంది. ఈ సమస్యల నుండి గట్టెక్కేందుకు నల్లబెల్లం కలిపిన ఫీడ్ ను చెక్ ట్రే పద్ధతిలో అందిస్తూ.. సత్ఫలితాలను పొందుతున్నారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొందరు రైతులు.

READ ALSO : Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు

వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లోనూ రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. అందులో రొయ్యల పెంపకం ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో వనామి రొయ్యల సాగు విస్తృతంగా సాగవుతోంది. అయితే, వాతావరణ మార్పులు , పలు రకాల వ్యాధులు వస్తున్నాయి. వీటికితోడు నాణ్యమైన పిల్ల దొరక్కపోవడంతో పాటు, మేత కారణంగా నష్టాలు చూడాల్సి వస్తోంది.

READ ALSO : Integrated Farming : ప్రణాళిక బద్ధంగా సమీకృత వ్యవసాయం.. కొబ్బరితో పాటు చేపలు , కోళ్లు పెంపకం

ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు తగ్గించుకుంటూ, రొయ్య పిల్లల వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు మేతలో నల్లబెల్లం వాడుతున్నారు పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం మండలం, వెంప గ్రామానికి చెందిన కొందరు రైతులు. అంతే కాదు ఫీడ్ ను వృధా చేయకుండా చెక్ ట్రే విధానంలో అందిస్తున్నారు.

READ ALSO : Fish Rain Reason : చేపల వర్షానికి కారణం ఏంటి? అసలు చేపలు ఆకాశంలో ఎలా వెళ్లాయి?

చెక్ ట్రేలను ఉపయోగించి చేపల చెరువుల్లో మేత అందించడం ద్వారా ఎంత ఫీడ్ వేస్తున్నామనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. దీంతోపాటు.. మనం అందించిన ఫీడ్ ని రొయ్యలు ఎంతమేర తింటున్నాయో తెలుసుకోవచ్చంటున్నారు రైతులు. అంతే కాదు నల్లబెల్లం ద్రావణం వ్యాధుల నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.