Horticultural Exhibition : విశేషంగా ఆకట్టుకున్న.. వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శన
Horticultural Exhibition : వివిధ రకాల పూలు, మొక్కల ప్రదర్శనతో పాటు సేంద్రియ పురుగుమందులు, పేడ, రైతులు పండించిన విత్తనాలు, ఇండోర్ ప్లాంట్లు, కుండీలు తదితర వాటిని విక్రయించే స్టాల్స్ ఉన్నాయని తెలిపారు.

Horticultural Exhibition
Horticultural Exhibition : విజయవాడ సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ మైదానంలో ఏర్పాటు చేసిన రోజ్ ఎగ్జిబిషన్, అగ్రి హార్టికల్చర్ షో అందరిని విశేషంగా ఆకట్టుకుంది. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, హరిత ప్రియ ప్లాంట్ లవర్స్ సొసైటీ , మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్లో దేశంలోని పలు రాష్ట్రాలనుండి నర్సరీ నిర్వాహకులు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు.
Read Also : Sesame Cultivation : నువ్వుసాగులో మేలైన యాజమాన్యం
రాష్ర్టంలో ఉద్యాన పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, హరిత ప్రియ ప్లాంట్ లవర్స్ సొసైటీ అధ్వర్యంలో రోజ్ ఎగ్జిబిషన్, అగ్రి హార్టికల్చర్ షో ఏర్పాటు చేస్తోంది. విజయవాడ లోని సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ నిన్నటితో ముగిసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలనుండి నర్సరీ నిర్వహకులు ఈ ఏగ్జిబిషన్ లో పాల్గొన్నారు. వివిధ రకాల పూలు , పండ్ల మొక్కలతో పాటు, కుండీలు, బోన్సాయ్ మొక్కలు కనువిందు చేశాయి.
పర్యావరణ పరిరక్షణ, సుందరీకరణ పెంపొందించేదుకు ప్రతి ఏటా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం సభ్యులు చేబుతున్నారు. చిన్నతనం నుంచే మొక్కలు పెంచే అలవాటును పెంపొందించుకోవడం వల్ల ఒత్తిడి లేని, ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చంటారు. వివిధ రకాల పూలు, మొక్కల ప్రదర్శనతో పాటు సేంద్రియ పురుగుమందులు, పేడ, రైతులు పండించిన విత్తనాలు, ఇండోర్ ప్లాంట్లు, కుండీలు తదితర వాటిని విక్రయించే స్టాల్స్ ఉన్నాయని తెలిపారు.
పట్టణ వాసులకు వారి అభిరుచులకు అనుహ్యంగా ఉద్యాన మొక్కల ప్రదర్శన ఉంది. ముఖ్యంగా టెర్రస్, కిచెన్, బాల్కనీ, వర్టికల్ గార్డెన్ ఏర్పాటుకు వివిధ రకాల పండ్లు, పూల మొక్కలను, పరికరాలను, సామాగ్రి ఈ ప్రదర్శన లో ఏర్పాటు చేశారు. ఇవి నగరవాసులను ఎంతగానో ఉపయోగపడటమే కాకుండా, ఆయా నర్సరీలకు మంచి మార్కెట్ ఏర్పడింది.
ఐదురోజుల పాటు నిర్వహించిన ఈ ప్రదర్శన ప్రతి రోజు ఉదయం10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సాగింది. మహిళలు, విద్యార్థినిలకు పలురకాల పోటీలు నిర్వహించి, తోమ్మిది రోజులపాటు తొమ్మిది లక్కీ డ్రాలు తీసి ప్రత్యేక బహుమతులు అందజేశారు.
Read Also : Sorghum Cultivation : జొన్న పంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలు