Papaya Plantations : బొప్పాయిలో చీడపీడల బెడదతో నష్టాలు.. ఈ సూచనలతో చెక్ పెట్టొచ్చు అంటున్న శాస్త్రవేత్తలు

papaya plantations : సకాలంలో వీటిని గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టక పోతే దిగుబడులు తగ్గడమే కాకుండా కాయ నాణ్యత కూడా కోల్పోతుంది.

Papaya Plantations : బొప్పాయిలో చీడపీడల బెడదతో నష్టాలు.. ఈ సూచనలతో చెక్ పెట్టొచ్చు అంటున్న శాస్త్రవేత్తలు

Integrated plant protection

Updated On : January 25, 2025 / 4:32 PM IST

Papaya Plantations : తెలుగు రాష్ట్రాలలో బొప్పాయి సాగు విస్తరిస్తోంది. ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలు అందుబాటులోకి వచ్చాక బొప్పాయిసాగు ఉన్నతస్థితికి చేరుకుంది. నాటిన 2 సంవత్సరాల వరకు దిగుబడినిచ్చే ఈ తోటలకు చీడపీడల సమస్య అధికంగానే ఉంటుంది. సకాలంలో వీటిని గుర్తించి నివారించకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పంట వేసే ముందే నుండే పలు జాగ్రత్తలు పాటించినట్లైతే అధిక దిగుబడులను పొందవచ్చంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త , డా. పి. సుధా జాకబ్ .

రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగువిస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు పెరటితోటలకే పరిమితమైన బొప్పాయి సాగు, ఇంత ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే  తైవాన్ రకాలని చెప్పవచ్చు. హెక్టారుకు 50 టన్నుల వరకు దిగుబడిని పొందుతున్నారు రైతులు. అయితే ఈ పంటకు చీడపీడల బెడద ఎక్కువే. ముఖ్యంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోను, భూసారం తగ్గినప్పుడు సూక్ష్మధాతు పోషక లోపాలు తలెత్తటం సహజంగా కన్పిస్తుంటుంది.

సకాలంలో వీటిని గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టక పోతే దిగుబడులు తగ్గడమే కాకుండా కాయ నాణ్యత కూడా కోల్పోతుంది. దీంతో మార్కెట్ లో మంచి ధర రాదు. మరి  ఈ సూక్ష్మదాతు లోపాల నివారణ చర్యలను ప్రధాన శాస్త్రవేత్త  , డా. పి. సుధా జాకబ్ ద్వారా తెలుసుకుందా…

బొప్పాయికి రకరకాల తెగుళ్లు ఆశిస్తాయి. ముఖ్యంగా భూమి ద్వారా కొన్ని తెగుళ్లు  ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంటాయి. శిలీంద్రానికి సంబందించిన కాండం కుళ్లు తెగులు మొదటి దశలో ఆశిస్తూ ఉంటుంది. ఇది ఆశించినప్పుడు మొదలు కుళ్లి పోయి, మొక్కలు చనిపోతూ ఉంటాయి. ఇందు కోసం  మొక్కలు నాటే ముందే కొన్ని జాగ్రత్త చర్యలు చేపట్టితే వీటిని నివారించవచ్చు .

రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పేనుబంక ఆశించి బొప్పాయి పంటను తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పురుగులు రసం పీల్చడమే కాకుండా వైరస్ తెగులును వ్యాప్తి చేస్తుంటాయి. సకాలంలో గుర్తించి వాటిని  నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read Also : Ground Nut Cultivation : వేరుశనగ కోతలో పాటించాల్సిన జాగ్రత్తలు.. ఏ మాత్రం తేడా వచ్చినా దిగుబడికి నష్టమే!