Paddy Cultivation : వరిపైరుకు ఆకుముడత పురుగు బెడద.. నివాణకు శాస్త్రవేత్తల సూచనలు

ఆకుముడత పురుగు ఆశించిన పొలాల్లో నేరుగా రసాయన మందులను పిచికారి చేస్తే ఫలితం ఉండదు. కాబట్టి రైతులు మొదట తాడుతో కానీ, ముళ్ల కంపతో కాని వరిపొలంపై లాగాలి. దీంతో ముడుచుకున్న ఆకులు తెరుచుకుంటాయి. దీంతో పురుగులు బయటకు కనబడతాయి .

Paddy Cultivation : వరిపైరుకు ఆకుముడత పురుగు బెడద.. నివాణకు శాస్త్రవేత్తల సూచనలు

Paddy Cultivation

Updated On : October 29, 2023 / 12:39 PM IST

Paddy Cultivation : వాతావరణ మార్పులతో వరిలో చీడపీడల సమస్య పెరిగిపోయింది .వరంగల్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో చిరుపొట్ట దశ, ఈనిక దశలో వున్న వరిపైరులో ప్రస్థుతం ఆకుముడత పురుగు ఉధృతంగా కనిపిస్తోంది. కంకి వేసే దశలో ఈ పురుగు తాకిడి వల్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. అనూష.

READ ALSO : Telangana : వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలు వేసుకోవాలి

ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యం కావడంతో వరంగల్ జిల్లాలోని చాలాప్రంతాల్లో రైతులు వరినాట్లు ఆలస్యంగా వేసారు.  ప్రస్తుతం వరిపైరు వివిధ దశల్లో ఉంది.పంటలో చీడపీడల తాకిడి ఎక్కువైంది. ఒకదానివెనుక మరొకటి దాడిచేస్తూ రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్థుతం ఆకుముడత పురుగు సోకి పంటకు తీవ్రనష్టం చేస్తోంది.

READ ALSO : Sore Throat : గొంతు నొప్పితో బాధపడుతున్నారా ? ఈ నీరు గ్లాసు చాలు..

నత్రజని ఎరువులను ఎక్కువ మోతాదులో వాడటం, పొలం చుట్టూ నీడ ప్రదేశాలు ఉండటం వల్ల ఈ పురుగు ఉధృతికి కారణమైంది. ఆకుముడతను నాము పురుగు, తెల్లతెగులు అనిపిలుస్తారు. ఈ  పురుగు నుండి పంటను కాపాడుకునేందుకు రైతులు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. అనూష.

READ ALSO : Green Gram Cultivation : ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాలకు అనువైన పెసర.. అధిక దిగుబడల కోసం మేలైన యాజమాన్యం

ఆకుముడత పురుగు ఆశించిన పొలాల్లో నేరుగా రసాయన మందులను పిచికారి చేస్తే ఫలితం ఉండదు. కాబట్టి రైతులు మొదట తాడుతో కానీ, ముళ్ల కంపతో కాని వరిపొలంపై లాగాలి. దీంతో ముడుచుకున్న ఆకులు తెరుచుకుంటాయి. దీంతో పురుగులు బయటకు కనబడతాయి . అప్పుడు శాస్త్రవేత్తలు సూచించిన మందులను పిచికారి చేస్తే పురుగు నాశనం అవుతుంది. సమగ్ర సస్యరక్షణలో భాగంగా ఆకుముడత పురుగుల తల్లిరెక్కల పురుగులను నాశనం చేసేందుకు, పొలంలో రాత్రిపూట మంటలు వేయటం లేదా దీపపు ఎరలు ఏర్పాటుచేయటం చేస్తే ఈ పురుగు తాకిడి తగ్గిపోతుంది.